E-Paper
Advertisement

Aloe Vera Ice Cubes: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఈ కలబంద ఐస్ క్యూబ్స్‌తో ఇంట్లోనే ఫేషియల్ !

Aloe Vera Ice Cubes: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఈ కలబంద ఐస్ క్యూబ్స్‌తో ఇంట్లోనే ఫేషియల్ !
Advertisement

Aloe Vera Ice Cubes: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రసాయనాలతో తయారు చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే.. నాచురల్ చిట్కాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ ‘కలబంద’ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే.. కలబంద జెల్‌ను ఐస్ క్యూబ్స్‌గా.. మార్చి ముఖానికి రాసుకోవడం ఇప్పుడు ఒక కొత్త బ్యూటీ ట్రెండ్. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా.. ముఖంపై ఉన్న అలసటను పోగొట్టి ఇన్స్టంట్‌గా గ్లోను ఇస్తుంది. అసలు ఈ అలోవెరా ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేయాలి ?, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..

అలోవెరా ఐస్ క్యూబ్స్:
చర్మ సౌందర్యానికి కలబంద ఒక అద్భుతమైన ఔషధం. అయితే.. సాధారణంగా జెల్ రాసుకోవడం కంటే.. దాన్ని ఐస్ ముక్కలుగా చేసి వాడటం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి. దీనినే ‘కోల్డ్ థెరపీ’ అని కూడా అంటారు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి.. ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

Advertisement

అలోవెరా ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేయాలి?

తయారీ చాలా సులభం:
కలబంద జెల్: ముందుగా తాజా కలబంద ఆకును తీసుకుని.. దాని లోపల ఉన్న తెల్లటి జెల్‌ను జాగ్రత్తగా వేరు చేయండి. (బయట దొరికే రెడీమేడ్ జెల్ కంటే ఇంట్లో పెరిగే మొక్క నుంచి తీసినది చాలా మంచిది).

Advertisement

మిక్సీ పట్టండి: ఆ జెల్‌ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మీకు కావాలంటే.. ఇందులో కొంచెం రోజ్ వాటర్ లేదా చిటికెడు పసుపు కూడా కలపవచ్చు.

ఫ్రీజ్ చేయండి: ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి 4-5 గంటల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచండి. అంతే.. మీ బ్యూటీ ఐస్ క్యూబ్స్ రెడీ.

ముఖానికి ఎలా వాడాలి?
క్లెన్సింగ్: ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగి, శుభ్రమైన తువ్వాలుతో తుడుచుకోండి.

మసాజ్: ఒక అలోవెరా ఐస్ క్యూబ్ తీసుకుని, దాన్ని పల్చటి కాటన్ క్లాత్ చుట్టండి (నేరుగా ఐస్ ముక్కను ముఖంపై పెట్టడం కంటే ఇది మంచిది). ముఖంపై వృత్తాకారంలో.. మెల్లగా 2-3 నిమిషాల పాటు మసాజ్ చేయండి.

ఆరనివ్వండి: మసాజ్ చేసిన తర్వాత ఆ జెల్‌ను ముఖంపైనే 10-15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత మామూలు నీటితో కడిగేయండి.

ప్రయోజనాలు :
ఓపెన్ పోర్స్ తగ్గిస్తుంది: ముఖంపై పెద్దగా కనిపించే రంధ్రాలను తగ్గించి, చర్మాన్ని స్మూత్‌గా మారుస్తుంది.

మొటిమలకు చెక్: కలబందలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. ఐస్ వాడటం వల్ల మొటిమల వాపు, నొప్పి తగ్గుతాయి.

డార్క్ సర్కిల్స్: కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్, వాపును తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది.

సన్ బర్న్: ఎండ వల్ల చర్మం ఎర్రగా కందిపోతే.. ఈ ఐస్ క్యూబ్స్ తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.

తక్షణ కాంతి: ఫంక్షన్లకు లేదా పార్టీలకు వెళ్లే ముందు ఈ ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేసుకుంటే.. ముఖం తాజాగా మెరిసిపోతుంది.

Also Read: ఎండాకాలం కూల్‌గా ఉండాలంటే.. ఏం తినాలి ? ఏం తినకూడదు?

ముఖ్యమైన జాగ్రత్తలు:
సెన్సిటివ్ స్కిన్: మీకు అతి సున్నితమైన చర్మం ఉంటే.. నేరుగా ఐస్ వాడకండి. గుడ్డలో చుట్టి మాత్రమే వాడండి.

సమయం: మసాజ్ 5 నిమిషాల కంటే.. ఎక్కువ సేపు చేయకూడదు.

ప్యాచ్ టెస్ట్: మొదటిసారి వాడుతున్నప్పుడు దవడ భాగంలో కొంచెం రాసి చూసుకోండి. ఎలాంటి మంట లేకపోతేనే ముఖమంతా వాడండి.

ఖరీదైన ఫేషియల్స్, క్రీములతో పనిలేకుండా.. ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో అలోవెరా ఐస్ క్యూబ్స్‌తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది చర్మానికి ఎంతో హాయినిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే.. మీ చర్మంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×