శరీర ఆరోగ్యంలో కిడ్నీలు అతి ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని వడకట్టి, అనవసర ద్రవాలు, వ్యర్థాలను తొలగిస్తాయి. కానీ కిడ్నీలు బాగా పనిచేయకపోతే శరీరంలో ద్రవాలు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితి రాగానే లక్షణాలు కళ్లలోనే కనించేస్తాయిి. ఉదయం లేచినపుడు కళ్ల చుట్టూ వాపు ఉండటం, కళ్ల కింద పఫ్‌లా కనిపించడం మొదటి సూచనలుగా వైద్యులు చెబుతున్నారు. ఇది కిడ్నీలు సరైనగా ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల నీరు, ఉప్పు శరీరంలో నిలవడం వలన వస్తుంది. చాలామంది దీనిని నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా అలసట అని భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది కిడ్నీ పనితీరు తగ్గుతున్న ప్రారంభ హెచ్చరిక కావచ్చు.
కళ్ళలో ఎరుపుదనం, చూపు తగ్గడం
కిడ్నీలు బలహీనపడుతున్నప్పుడు శరీరంలోని టాక్సిన్లు తగ్గకపోవడం వల్ల కళ్లలో కూడా మార్పులు కనిపిస్తాయి. కళ్ళు ఎర్రగా మారడం, ఎండిపోయినట్టుగా ఉండటం, నీళ్లు రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇక రక్తపోటు ఎక్కువగా ఉండే వారికి కిడ్నీ సమస్యలు పెరిగితే రెటినా మీద ప్రభావం పడుతుంది. దీని వల్ల చూపు బ్లర్ అవ్వడం, చూపు మందగించడం, లైట్ల చుట్టూ రింగులు కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ కళ్ల సమస్య అనకుంటారు కానీ కిడ్నీల సమస్య అనుకోరు. ఈ లక్షణాలు కళ్ల సమస్యలనే కాదు శరీరం లోపల కిడ్నీలు బాగాలేవని చెప్పడమే. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కంటి దృష్టికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రంలో మార్పులు
కళ్ళతో పాటు శరీరంలో ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాళ్లు, మోకాలు, చేతుల్లో వాపు రావడం, శరీరం ద్రవాలు నిలిచిపోవడం వల్ల బరువు అకస్మాత్తుగా పెరగడం, ఎల్లప్పుడు అలసటగా ఉండటం. నిద్ర సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కిడ్నీ సమస్యకు సంకేతాలుగా భావించాలి. అలాగే మూత్రం నురుగలా రావడం, మూత్రం రంగు మారడం, నీళ్లు తాగినా తక్కువ మూత్రం రావడం వంటి పరిస్థితులు ప్రోటీన్ లీకేజీ లేదా ఫిల్టరింగ్ సమస్య ఉన్నట్లు సూచిస్తాయి. రక్త పరీక్షల్లో క్రియాటినిన్ పెరగడం, eGFR తగ్గడం వంటి ఫలితాలు కిడ్నీ పనితీరు తగ్గుతోందడని చెప్పడానికి సంకేతాలుగానే భావించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
వైద్యులు చెబుతున్నట్టు కిడ్నీ వ్యాధులు చాలా సార్లు నిశ్శబ్దంగానే మొదలవుతాయి. కాబట్టి కళ్లలో మార్పులు, వాపులు, చూపులో మార్పులు కనిపిస్తే వెంటనే సరైన పరీక్షలు చేయించుకోవాలి. అధిక ఉప్పు, ఫ్రై చేసిన ఆహారాలు, శరీరంలో ద్రవాలు నిలిచే ఆహారాలు తగ్గించడం, రోజు తగినంత నీరు తాగడం, అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు పనిలోపని కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా మంచి నిద్ర, తగినంత వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా కిడ్నీ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కళ్ళలో కనిపించే చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా చూడాలి. త్వరగా గుర్తిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని కూడా తగ్గించొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.