E-Paper
Advertisement

Bandi Sanjay: బ్రిటీష్ జనతా పార్టీ వర్సెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay: బ్రిటీష్ జనతా పార్టీ వర్సెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్
Advertisement

Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీని బ్రిటీష్ జనతా పార్టీ అని విమర్శించారు. ఈ విమర్శలకు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని “బ్రిటిష్ జనతా పార్టీ” అని పిలుస్తారని, కానీ కాంగ్రెస్‌ను బ్రిటిష్ పౌరుడు స్థాపించారన్న విషయం మర్చిపోయారన్నారు. ఇప్పుడు, INC – “ఇటలీ నేషనల్ కాంగ్రెస్” గా మారిందని విమర్శించారు. MGNREGA పేరు గురించి కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని, కానీ మహాత్మా గాంధీ నిజమైన ఆశయాలు ఎప్పుడు పట్టించుకోలేదన్నారు.

స్కిల్ యూనివర్సిటీలో సీఎంకు ఫస్ట్ సీటు

“స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ కోరుకున్నారు. కాంగ్రెస్‌ను పదే పదే ఓడిస్తూ.. ప్రజలు గాంధీజీ దార్శనికతను నెరవేరుస్తున్నారు. విభజించి పాలించు అని మాట్లాడే కాంగ్రెస్, ఓటు బ్యాంక్ కోసం భారతీయులను కులం, మతం పేరిట విభజించింది. బీజేపీ సంక్షేమ పథకాలు, గృహనిర్మాణం, రేషన్లు, గ్యాస్ సబ్సిడీ మతంతో సంబంధం లేకుండా పేదలకు చేరుతుంది. కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా పెంచి పోషించిన బానిస మనస్తత్వాన్ని బీజేపీ తొలగిస్తుంది. స్కిల్స్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సును చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నాను. అందులో మొదటి విద్యార్థి సీఎం రేవంత్ రెడ్డి అయి ఉండాలి. ఆయన స్కిల్స్ లో స్పష్టమైన తేదా ఉంది” -కేంద్రమంత్రి బండి సంజయ్

సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

Advertisement

బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటీష్ జనతా పార్టీ అని చమత్కరించారు. ఆనాడు బ్రిటీషర్లతో ఎంత ప్రమాదం ఎదురైందో.. నేడు బీజేపీతో అంతే ప్రమాదం ఉందన్నారు. విభజించు, పాలించు, పేదలను అణగదొక్కు అని బ్రిటీషర్ల ఆలోచనతోనే ఇవాళ బీజేపీ దేశ ప్రజల్ని అణచివేస్తుందన్నారు. పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరు పేదల కోసం, యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తెస్తే ఆ పథకాన్ని రద్దు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Also Read: మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ అడగండి: సింగరేణి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

Advertisement

ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామాల నుంచి వలసలు తగ్గాయని, గ్రామాల్లో కూలీలు తమ కూలీని తాము నిర్ణయించే శక్తి ఆ చట్టం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీలకు కూలీలు దొరకడం లేదని, ప్రజలు వలసలు పోవడంలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, మళ్లీ రైతులు, రైతు కూలీలు, గ్రామాలు వదిలి వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పట్టణాలకు వలస పోతే మళ్లీ వెట్టి చాకిరి వస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×