E-Paper
Advertisement

Health Tips: గుడ్డులోని పచ్చసొన తింటే గుండెపోటు వస్తుందా? అసలు నిజం ఏంటంటే?

Health Tips: గుడ్డులోని పచ్చసొన తింటే గుండెపోటు వస్తుందా? అసలు నిజం ఏంటంటే?
Advertisement

Health Tips: మనం రోజూ తినే ఆహారాల్లో గుడ్డు ఓ సంపూర్ణ పోషకాహారం అని మనందరికీ తెలసిందే. కానీ, గుడ్డు అనగానే చాలామందికి వచ్చే మొదటి సందేహం.. లోపల ఉండే పచ్చసొన తినాలా? వద్దా? అని. పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని ఎన్నో ఏళ్ల నుంచి ఒక భయం మనల్ని వెంటాడుతోంది. అందుకే చాలామంది కేవలం తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను పక్కన పడేస్తుంటారు. అయితే, నేటి ఆధునిక వైద్య పరిశోధనలు ఈ విషయంలో మనకు కొత్త విషయాలను వెల్లడిస్తున్నాయి.

పోషకాల గని పచ్చసొన:

నిజానికి గుడ్డులోని అసలైన పోషకాలన్నీ పచ్చసొనలోనే దాగి ఉన్నాయి. దీనిలో విటమిన్ ఎ, ఇ వంటి కీలక విటమిన్లతో పాటు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తెల్లసొన కేవలం ప్రోటీన్ మాత్రమే అందిస్తే, పచ్చసొన శరీరానికి అవసరమైన శక్తిని, మెదడు పనితీరుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నవారు పచ్చసొనను వదిలేయడం వల్ల కీలకమైన పోషకాలను కోల్పోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: విటమిన్ B12 లోపాన్ని గుర్తిండమెలా? ఈ సమస్య తగ్గాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

కొలెస్ట్రాల్ భయం ఎంతవరకు నిజం?

పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అది మనం అనుకున్నంత హానికరం కాదు. మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పైగా, ఇది శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్(HDL) పెరగడానికి సహాయపడుతుంది. ఇది ధమనుల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

అసలైన శత్రువు ఎవరు?

Advertisement

శరీరంలో చెడు కొలెస్ట్రాల్(LDL) పెరగడానికి కేవలం గుడ్డు పచ్చసొన మాత్రమే కారణం కాదు. మనం తీసుకునే జంక్ ఫుడ్, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలే అసలైన విలన్లు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారం తీసుకుంటే.. రోజుకు ఒక గుడ్డు పచ్చసొనతో సహా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

పచ్చసొన ఆరోగ్యకరమే అయినప్పటికీ, అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు, డయాబెటిస్ బాధితులు, రక్తంలో కొలెస్ట్రాల్ విపరీతంగా ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రం పచ్చసొన విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రం మితంగా పచ్చసొనను ఆస్వాదించవచ్చు.

Also Read: తలలో పేలు.. మనుషులను చంపేస్తాయా? ఆ బాలిక మరణానికి కారణం పేలేనా?

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×