E-Paper
Advertisement

కిచెన్ స్పాంజిలో కోట్ల బ్యాక్టీరియా.. మార్చడానికి సరైన సమయం ఇదే!

కిచెన్ స్పాంజిలో కోట్ల బ్యాక్టీరియా.. మార్చడానికి సరైన సమయం ఇదే!
Advertisement

Kitchen Sponge Replacement: మనం వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచినా, గిన్నెలు కడిగే స్పాంజి లేదా బ్రష్ విషయంలో తరచుగా అశ్రద్ధ చేస్తాం. చూడటానికి చిన్నవిగా కనిపించే ఈ వస్తువులే అనారోగ్యానికి ప్రధాన కారణమవుతాయని మీకు తెలుసా? నిరంతరం తడిగా ఉండే స్పాంజీలు కోట్ల కొద్దీ బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారుతాయి. వీటిని ఎప్పుడు మార్చాలి? ఎందుకు తడిగా ఉంచకూడదు? అనే విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ కుటుంబ ఆరోగ్యం ముప్పులో పడినట్లే. వంటగది పరిశుభ్రత గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

వంటగదిలోని స్పాంజీలు,బ్రష్‌లు ఎప్పుడు మార్చాలి? ఎందుకు?
వంటగది అనేది ఇంటికి చాలా ముఖ్యమైంది. కానీ.. అదే వంటగదిలో మనం గిన్నెలు కడగడానికి ఉపయోగించే స్పాంజి ప్రపంచంలోనే అత్యంత మురికి వస్తువులలో ఒకటిగా పరిశోధనల్లో తేలింది. ఒక చిన్న స్పాంజి ముక్కపై టాయిలెట్ సీటు కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

స్పాంజీలను ఎప్పుడు మార్చాలి?
చాలామంది స్పాంజి చిరిగిపోయే వరకు లేదా పూర్తిగా రంగు మారే వరకు వాడుతూనే ఉంటారు. కానీ నిపుణుల సూచనల ప్రకారం..

ప్రతి వారం: సాధారణంగా కిచెన్ స్పాంజీని ప్రతి వారం లేదా గరిష్టంగా రెండు వారాలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి.

Advertisement

దుర్వాసన వస్తే: స్పాంజి నుంచి స్వల్పంగానైనా చెడు వాసన వస్తుందంటే.. అందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతోందని అర్థం. వెంటనే దానిని పారేయాలి.

రంగు మారడం: ఆహార పదార్థాల మరకలు పోకుండా.. స్పాంజి జిడ్డుగా మారితే అది వాడటానికి పనికిరాదని గుర్తించాలి.

కిచెన్ బ్రష్‌ల పరిస్థితి ఏంటి?
స్పాంజీలతో పోలిస్తే.. ప్లాస్టిక్ లేదా సిలికాన్ బ్రష్‌లు కొంత మెరుగైనవి. ఎందుకంటే ఇవి త్వరగా ఆరిపోతాయి. అయినప్పటికీ..వీటిని ప్రతి 1 నుంచి 2 నెలలకు ఒకసారి మార్చడం మంచిది. బ్రష్‌లోని.. వెంట్రుకలు వంగిపోయినా లేదా రంగు మారినా మార్చడం తప్పని సరి.

తడిగా వదిలేయడం ఎందుకు ప్రమాదకరం?
వంటగది స్పాంజీలను సింక్ పక్కన తడిగా.. వదిలేయడం అత్యంత ప్రమాదకరం. దీనికి కారణాలు ఇవే..

బ్యాక్టీరియా వృద్ధి: తడి, వెచ్చని వాతావరణంలో Salmonella, E. coli, Campylobacter వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు కేవలం 20 నిమిషాల్లో రెట్టింపు అవుతాయి.

ఫంగస్ , మొల్డ్: నిరంతరం తడిగా ఉండటం వల్ల స్పాంజీ లోపలి పొరల్లో బూజు చేరుతుంది. ఇది కంటికి కనిపించదు కానీ.. ఆహారం ద్వారా శరీరంలోకి చేరి జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది.

దుర్వాసన: తడి వల్ల కలిగే సూక్ష్మజీవుల చర్య వల్ల స్పాంజి నుంచి దుర్వాసన వస్తుంది. ఇది గిన్నెలకు కూడా అంటుకుంటుంది.

Also Read: షుగర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఈ చిన్న మార్పులతో మధుమేహానికి చెక్!

ఆరోగ్యకరమైన అలవాట్లు:
ఆరబెట్టడం: గిన్నెలు కడగడం పూర్తయిన తర్వాత స్పాంజిని గట్టిగా పిండి, గాలి ఆడే చోట ఉంచాలి. సింక్ అడుగున నీటిలో వదిలేయకూడదు.

శుభ్రం చేయడం: ప్రతి రోజూ రాత్రి పూట స్పాంజిని వేడి నీటిలో వేసి లేదా మైక్రోవేవ్‌లో ఒక నిమిషం పాటు ఉంచి క్రిములు చనిపోయేలా చేయవచ్చు. కానీ ఇది తాత్కాలికమే.. వారం దాటిన తర్వాత మార్చడమే బెస్ట్.

వేర్వేరు పనులు: గిన్నెలు కడిగే స్పాంజుతోనే.. కిచెన్ ప్లాట్‌ఫారమ్ లేదా స్టవ్ తుడవడం చేయకూడదు. దీని వల్ల బ్యాక్టీరియా ఒక చోటు నుండచి మరొక చోటుకు వ్యాపిస్తుంది.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×