E-Paper
Advertisement

Tiles Cleaning Tips: ఇలా చేస్తే.. టైల్స్‌పై మరకలు క్షణాల్లోనే మాయం

Tiles Cleaning Tips: ఇలా చేస్తే.. టైల్స్‌పై మరకలు క్షణాల్లోనే మాయం
Advertisement

Tiles Cleaning Tips: ఇంటి టైల్స్ శుభ్రం చేయడం అనేది ప్రతి ఇల్లాలికి సవాల్ అనే చెప్పాలి. తరచుగా శుభ్రం చేస్తున్నా కొన్ని రకాల మరకలు పోగొట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి సమయంలోనే జిడ్డు మరకలు పోగొట్టడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

ఇంట్లోని టైల్స్ శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, ఉప్పు, బోరాక్స్ వంటి వాటితో హోం రెమెడీస్‌ తయారు చేసి కూడా ఉపయోగించవచ్చు. ఈ పదార్థాలు మీ బడ్జెట్‌‌లోనే లభిస్తాయి. అంతే కాకుండా టైల్స్‌ను తక్కువ సమయంలోనే మెరిసేలా చేస్తాయి.

Advertisement

టైల్స్ శుభ్రపరిచే హోం రెమెడీస్:

మురికి, పసుపు రంగులోని టైల్స్ మరకలు:

Advertisement

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా ఒక సహజమైన స్క్రబ్. ఇది మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. కాస్త బేకింగ్ సోడా తీసుకుని దీనిని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి టైల్స్‌పై అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత బ్రష్ సహాయంతో రుద్దాలి. అనంతరం శుభ్రమైన నీటితో కడగాలి.

వెనిగర్: వెనిగర్‌లో మురికిని తొలగించే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కాస్త వెనిగర్‌ను తీసుకుని దీన్ని నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపి టైల్స్‌పై స్ప్రే చేయాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్: హైడ్రోజన్ పెరాక్సైడ్ పసుపు రంగు మరకలను తొలగించడంలో సహాయపడే మంచి బ్లీచింగ్ ఏజెంట్. దీనిని టైల్స్‌పై జాగ్రత్తగా అప్లై చేసి కొంత సమయం తర్వాత కడిగేయాలి.

నిమ్మరసం: నిమ్మరసం సహజ ఆమ్లం. ఇది మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. టైల్స్‌పై నిమ్మరసం రాసి కొంత సమయం తర్వాత కడిగేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఉప్పు: ఉప్పు నీటి మరకలను తొలగించడంలో ఉప్పు ప్రభావవంతంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలపడం ద్వారా టైల్స్ శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మరకలు తొలగిపోతాయి.

Also Read: మెడ, మోచేతులపై డార్క్ నెస్ క్షణాల్లో.. పోగొట్టే చిట్కాలు

బోరాక్స్: బోరాక్స్ అనేది సహజమైన క్లీనర్. ఇది మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనిని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి టైల్స్‌పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత బ్రష్ తో అప్లై రుద్ది నీటితో శుభ్రం చేయాలి. మొండి మరకలపై దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×