Virat Kohli: ఒకప్పుడు తన దూకుడైన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను అలరించిన టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. తన అరంగేట్రం నుంచి కోహ్లీ సత్తా చాటుతూనే ఉన్నాడు. కానీ ఈ మధ్య న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో తీవ్రంగా విఫలమై నిరాశపరిచాడు విరాట్ కోహ్లీ.
Also Read: Rohit Sharma: ఆ బౌలర్ ను టార్చర్ చేస్తున్న రోహిత్…ఇది పద్దతేనా హిట్ మ్యాన్ ?
దీంతో క్రీడాభిమానులు, మాజీ ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే సమయం ఆసన్నమైందంటూ విమర్శలు గుప్పించారు. క్రికెట్ లో ఎవరు గ్రేట్ బ్యాటర్..? ఎవరు గ్రేట్ బౌలర్..? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఎవరైనా కొత్త ఆటగాడు ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లపాటు నిలకడగా రాణిస్తే.. ఇలాంటి చర్చలు మరింత ఉపందుకుంటాయి. గతంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కి, విరాట్ కోహ్లీ కి మధ్య కంపారిజన్ కూడా చూశాం.
వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పలువురు ముఖ్యమంత్రులు విరాట్ కోహ్లీని పొగిడిన వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇటీవల విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా దావోస్ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ పలు జాతీయ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో పొరుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గురించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మీకు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ తో పోటీ ఉందని భావిస్తున్నారా..? అన్న ప్రశ్నకి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ” మాకు ఎటువంటి పోటీ లేదు. సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్లు ఇద్దరూ క్రికెట్ దిగ్గజాలు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇది విరాట్ కోహ్లీ యుగం. ఎలా ఆడాలో కోహ్లీ చూపిస్తాడు” అని సమాధానమిచ్చారు రేవంత్ రెడ్డి.
మరోవైపు ఓ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పారు. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ “ఆహా” వేదికగా టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తనకి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కంటే కోహ్లీనే ఎక్కువ ఇష్టమని స్పష్టం చేశారు చంద్రబాబు.
Also Read: Mohammed Siraj: ఆ సింగర్‌తో DSP సిరాజ్ డేటింగ్.. పోటోలు వైరల్!
ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా తనకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పారు. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు విరాట్ కోహ్లీని పొగిడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కోహ్లీ అభిమానులు.
CHIEF MINISTERS ON VIRAT KOHLI RECENTLY:
Andhra Pradesh CM said – "I always prefer Virat Kohli, He's my favourite".
Telangana CM said – "This is Virat Kohli's Era".
Madhya Pradesh CM said – "Virat Kohli is my favourite Cricketer".
– KING KOHLI, THE GOAT..!!!! 🐐👑 pic.twitter.com/SqHgbJKHLr
— Tanuj Singh (@ImTanujSingh) January 26, 2025