Dark Elbows: మెడ, మోచేతులపై నలుపుదనం అనేది సాధారణ సమస్య. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది.సూర్య కిరణాలకు గురికావడం, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం లేదా మరికొన్ని కారణాల వల్ల ఈ సమస్య ఎదుర్కోవలసి వస్తుంది. మెడ, మోచేతులపై నలుపుదనం మీ అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే వీటిని తగ్గించుకోవడానికి హోం రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి.
పెరుగు, పసుపు, నిమ్మ, తేనె, బాదం నూనె వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన పేస్ట్‌లు, స్క్రబ్‌లు చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తులపై ఆధారపడే బదులు కొన్ని సులభమైన , సహజమైన రెమెడీస్‌ని ప్రయత్నించండి. ఇవి తక్షణ ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా మీ చర్మానికి పోషణనిస్తాయి. మెడ , మోచేతుల నుండి చీకటిని తొలగించడానికి కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి తెలుసుకుందాం.
6 హోం రెమెడీస్:
పెరుగు, పసుపు పేస్ట్: పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ , పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని పమ పాళ్లలో కలుపుకుని ఈ పేస్ట్‌ను మెడ, మోచేతులపై నల్లగా ఉన్న చోట అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
నిమ్మరసం , తేనె: నిమ్మకాయలో ఉండే విటమిన్ సి సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ . అంతే కాకుండా తేనె చర్మాన్ని తేమగా మారుస్తుంది. రెండింటినీ కలిపి పేస్ట్‌లా చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. తర్వాత 20 నిమిషాలు ఆగి శుభ్రం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా అనేది సహజమైన ఎక్స్‌ఫోలియంట్, ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాస్త బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి మెత్తగా రుద్దాలి. తర్వాత దీనిని ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేసి 15 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.
అలోవెరా జెల్: అలోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, హీలింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఉపశమనం చేస్తాయి. అంతే కాకుండా మెడ, మోచేతులపై నల్లగా ఉన్న ప్రాంతంలో దీనిని అప్లై చేయడం వల్ల డార్క్ నెస్ పోయి చర్మం తెల్లగా మెరిపోతుంది
బంగాళదుంప రసం: బంగాళదుంపలో ఉండే ఎంజైమ్‌లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రభావిత ప్రాంతంపై బంగాళాదుంప ముక్కను రుద్దండి లేదా దాని రసాన్ని రాయండి. 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ఈ డ్రింక్ త్రాగితే.. చాలు ఆరోగ్య సమస్యలు రమ్మన్నా రావు తెలుసా ?
ఆల్మండ్ ఆయిల్: బాదం నూనె చర్మానికి పోషణనిచ్చి నలుపుదనాన్ని తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ప్రతి రోజు ముఖం, మెడపై అప్లై చేయడం వల్ల నలుపుదనం పోయి తెల్లగా మారుతుంది.