BigTV English

HDB Ravi Teja: గ్లింప్స్ తో ‘మాస్ జాతర’ సృష్టిస్తున్న రవితేజ..!

HDB Ravi Teja: గ్లింప్స్ తో ‘మాస్ జాతర’ సృష్టిస్తున్న రవితేజ..!

HDB Ravi Teja:మాస్ మహారాజా రవితేజ (Raviteja) తాజాగా ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈయన, గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా సరే గట్టిగా సక్సెస్ కొట్టాలని పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ‘భాను భోగవరపు’ దర్శకత్వంలో ‘మాస్ జాతర’ అనే సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


మాస్ జాతర గ్లింప్స్ రిలీజ్..

ఈరోజు గణతంత్ర దినోత్సవం.. దీనికి తోడు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కూడా.. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇప్పటికే రవితేజ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. అందులో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రవితేజ (Raviteja) మరొకసారి వింటేజ్ లుక్కుతో అబ్బురపరిచారు. ఇక ఇప్పుడు గ్లింప్స్ కూడా అదిరిపోయింది. శ్రీ లీల (Sreeleela) ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా .. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకోబోతోంది.


ఆకట్టుకుంటున్న గ్లింప్స్..

గ్లింప్స్ విషయానికి వస్తే.. రవితేజ “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్” లో తన అందాన్ని తానే చూసుకుంటూ మురిసిపోయినట్టు ఇక్కడ కూడా అలాగే తన అందాన్ని తాను చూసుకుంటూ మురిసిపోతున్నట్టు చూపిస్తూ స్టార్ట్ చేశారు. ఇక రవితేజ మాస్ జాతర “మనదే ఇదంతా” అని చెప్పే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏది ఏమైనా ఈసారి ఈయనకు ఒక మంచి హిట్ పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రవితేజ కెరియర్..

మాస్ మహారాజా గా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ, గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ కోసం భారీగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోలేదు. ‘ధమాకా’ సినిమా తర్వాత పలు చిత్రాలు చేశారు. కానీ ఆ రేంజ్ లో సక్సెస్ కాలేదని చెప్పాలి. అందుకే ఇప్పుడు మళ్లీ ధమాకా కాంబోని రిపీట్ చేస్తున్నారు రవితేజ. ధమాకా సినిమాలో రవితేజ ఆయనకు జోడిగా పర్ఫెక్ట్గా సూట్ అయిందని, అప్పట్లో చాలా మంది కామెంట్లు చేశారు. అందుకే ఇప్పుడు మళ్ళీ అదే కాంబో రిపీట్ అవుతోంది. అంతేకాదు ధమాకా సినిమా మ్యూజిక్ పరంగా కూడా హిట్ అవ్వడంతో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని దీనికి కూడా నియమించడం జరిగింది. అంతేకాదు మాస్ జాతర సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని, మళ్లీ ఇండస్ట్రీలో కం బ్యాక్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు రవితేజ. అందులో భాగంగానే ప్రతి విషయంపై కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×