E-Paper
Advertisement

Stains Removal Tips: ఇలా చేస్తే.. తెల్ల బట్టలపై మరకలు ఈజీగా తొలగిపోతాయ్ !

Stains Removal Tips: ఇలా చేస్తే.. తెల్ల బట్టలపై మరకలు ఈజీగా తొలగిపోతాయ్ !

Stains Removal Tips: చాలా మంది తెల్లటి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. తెల్లటి బట్టలు ధరించిన తర్వాత వాటిపై ఎటువంటి మరకలు పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా బట్టలపై మరకలు పడటం కామన్ . ఆహార పదార్థాల మరకలతో వివిధ రంగుల బట్టలను ఒకే సారి నానబెట్టినా కూడా వాటి కలర్ కూడా తెల్ల బట్టల రంగును పాడు చేస్తాయి. లిప్‌స్టిక్, కాజల్ లేదా ఐలైనర్ వేసుకునేటప్పుడు కూడా అమ్మాయిలు వాడే బట్టలపై చాలా మరకలు ఏర్పడతాయి. ఈ మరకలను వదిలించుకోవడం కోసం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెల్లటి బట్టలపై ఉన్న మరకలను తొలగించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి నీరు: 
వేడి నీరు ప్రభావవంతంగా మరకలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అత్యంత మొండి మరకలను దాని నాణ్యతను దెబ్బతీయకుండా కూడా తొలగిస్తుంది. నీరు కేవలం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి లేకుంటే అది మీ బట్టల రంగును తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి.

ఎలా వాడాలి ?
1.ముందుగా ఒక కప్పులో వేడి నీటిని పోసి ఆపై దానిని నేరుగా మరకపై రాయండి.
2.ఇప్పుడు నెమ్మదిగా మరక మీద 10-15 సెకన్ల పాటు నీటిని పోసి, ఆపై కొన్ని చుక్కల డిటర్జెంట్ చల్లండి
3.ఇప్పుడు క్లాత్ తిప్పి మరోవైపు డిటర్జెంట్‌ ( సర్ఫ్ ) కూడా రాయండి.
4. మరక పోయే వరకు బ్రష్ తో రుద్దండి. చివరగా శుభ్రమైన నీటితో వాష్ చేయండి.

వెనిగర్:

వెనిగర్ బట్టల నుండి మొండి మరకలను తొలగించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు రోజూ బట్టలు ఉతికేటప్పుడు ఒక టీస్పూన్ వెనిగర్ కలుపుకుంటే, బట్టలు మృదువుగా మారుతాయి. అంతే కాకుండా మరకల నుండి ఎదైనా చెడు వాసన వస్తున్నా కూడా తక్షణమే తొలగిస్తుంది. వెనిగర్ తో టీ మరకలను కూడా ఈజీగా తొలగించవచ్చు.

ఎలా వాడాలి ?
1. ముందుగా ఒక స్ప్రే బాటిల్‌లో అర కప్పు వెనిగర్ , అర కప్పు నీరు కలపండి.
2. ఇప్పుడు రెండింటినీ బాగా కలిపి నేరుగా మరక మీద స్ప్రే చేయండి.
3. మరకలు ఉన్న ప్రదేశంలో 5-7 నిమిషాలు అలాగే ఉంచండి.
4. కొంత సమయం తర్వాత మళ్ళీ బట్టలపై ఈ లిక్విడ్ తో రుద్ది నీటిలో ముంచండి.
5. తర్వాత బ్రష్ తో రుద్దడం వల్ల ఎలాంటి మొండి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి.

వంట సోడా:

బేకింగ్ సోడా ఒక సహజ క్లెన్సర్ . మీ తెల్ల బట్టలను బట్టలను ప్రకాశవంతంగా చేయడానికి , మృదువుగా చేయడానికి మీ సాధారణ డిటర్జెంట్‌లో బేకింగ్ సోడాను కలపడం మంచిది. బట్టలపై ఉన్న మొండి టీ మరకలను వదిలించుకోవడానికి దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: కిచెన్ క్లీనింగ్ ఇబ్బందిగా మారిందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !

ఎలా వాడాలి ?
1. ముందుగా సగం బకెట్ వేడి నీటిని తీసుకోండి.
2. ఇప్పుడు మరకలు ఉన్న తెల్ల బట్టలను అందులో 5-10 నిమిషాలు నానబెట్టండి.
3. దీని తరువాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కాస్త నీరు వేసి పేస్ట్ లాగా చేయండి. దీనిని మరకలపై వేసి రుద్దండి
4. మరకను తొలగించడానికి బ్రష్ తో రుద్దడం చేయండి.
5. ఇప్పుడు బేకింగ్ సోడాను మరక ఉన్న మరొక వైపున పూసి దాదాపు గంటసేపు అలాగే ఉంచండి.
6. ఒక గంట తర్వాత శుభ్రమైన నీటితో బట్టలు ఉతకాలి.
ఇలా చేయడం వల్ల మీ బట్టలపై ఉన్న మరకలు పూర్తిగా తొలగిపోతాయి.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×