BigTV English

Vishwak Sen : పోనిలే పాపం అని అండగా ఉంటే… పరువు మొత్తం తీశారు కదరా…

Vishwak Sen : పోనిలే పాపం అని అండగా ఉంటే… పరువు మొత్తం తీశారు కదరా…

Vishwak Sen : ఓ సినిమా చేస్తున్నారు అంటే… ఆ కథపై, కథనంపై ఎన్నో సార్లు చర్చలు జరుపుతారు. ఎవరూ అంత ఈజీగా ఓ సినిమా చేయరు. అది హీరో అయినా… నిర్మాతలు అయినా. కానీ, లైలా మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి అసలు ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చనే వస్తుంది. చివరికి విశ్వక్ సేన్ లేడీ గేటప్ వేస్తున్నాడు అని పోస్టర్లు వచ్చినా… సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎంతో కొంత సినిమాపై బజ్ వచ్చింది అంటే కేవలం 30 ఇయర్స్ పృథ్వి చేసిన ‘11 గొర్రెలు’ కామెంట్ వల్లే.


ఆ ‘11 గొర్రెలు’ కామెంట్ కాస్త రాజకీయం కావడంతో… ఓ వర్గం సినిమాపై నెగిటివిటీ ప్రచారం చేసింది. మరో వర్గం సినిమా గురించి పెద్దగా తెలియకుండానే… అపోజిషన్ వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లైలా మూవీకి అండగా నిలబడింది.

అలా… ఈ రోజు ఓ పొలిటికల్ వర్గం స్ట్రాంగ్ సపొర్ట్‌తో థియేటర్‌లోకి వచ్చేసింది లైలా. ఈ సినిమా హిట్ అయితే… కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు అని హీరో కంటే ఎక్కువ అనుకున్నారు వాళ్ళు. కానీ, ప్లాన్ అంతా బెడిసికొట్టింది. సినిమా క్రింజ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాపై ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదు. సినిమా చూసిన క్రిటిక్స్ అయితే.. ZERO రేటింగ్ అంటూ రివ్యూ ఇస్తున్నారు.


ఇక సోషల్ మీడియా పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్ అవుతుంది. దీంతో ఈగోకు వెళ్లి సపొర్ట్ చేసి ఉన్న పరువు తీసుకున్నాం కదరా.. అంటూ నెత్తి నోరకొట్టుకుంటున్నారు కొంత మంది. మెగా ఫ్యాన్స్ అయితే… ఈ సినిమా కోసమా..? చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా పిలిచారు అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రైలర్‌తో అయినా తెలుసుకోవాల్సింది..

“అవును.. ట్రైలర్‌తో అయినా తెలుసుకోవాల్సింది.. తప్పు చేశాం” అని కూడా అంటున్నారు. ట్రైలరే కాదు… ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా సినిమాపై హైప్‌ను క్రియేట్ చేయడంలో విఫలమయ్యాయి. టీజర్ కూడా మెప్పించలేదు. ట్రైలర్‌తో కావాల్సినంత బజ్ వస్తుందని టీం అనుకుంది. కానీ, ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే అంత మంచింది అని డిసైడ్ అయినవాళ్లే ఎక్కువ ఉన్నారు.

విశ్వక్ తీరు మార్చుకోవాలి… 

ఇండస్ట్రీ వినూత్న ప్రయోగాలు పరుగులు పెడుతోంది. కొత్త కొత్త కథలు వెతుక్కుంటూ… యంగ్ డైరెక్టర్స్ కూడా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నారు. అలాంటిది విశ్వక్ సేన్ మల్టీ టాలెంటెడ్. నటించడమే కాదు… రైటింగ్ చేయగలడు. డైరెక్షన్ కూడా చేయగలడు. ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మాత్రమే ఇలా ఉన్నారు. అలాంటి విశ్వక్ సేన్ నుంచి ఈ లైలా లాంటి మూవీ వస్తుందని ఎవరూ అనుకోలేరు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×