BigTV English

Kitchen Cleaning Tips: కిచెన్ క్లీనింగ్ ఇబ్బందిగా మారిందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !

Kitchen Cleaning Tips: కిచెన్ క్లీనింగ్ ఇబ్బందిగా మారిందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !

Kitchen Cleaning Tips: వంట గది శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో ఉన్న అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే .. వంట గదిని తక్కువ సమయంలోనే క్లీన్ చేయవచ్చు. ఒక్కో సారి వంటగదిని శుభ్రం చేయడానికి అంతగా టైం ఉండదు. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ కిచెన్ కూడా నీట్ గా ఉంటుంది.


1. వంటగది ఫ్లోర్ క్లీనింగ్:
మీ వంటగదిలో లేత లేదా తెల్లటి టైల్స్ ఉంటే వాటి క్లీనింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. టైల్స్ మధ్య ఖాళీలలో దుమ్ము సులభంగా ఇరుక్కుపోతుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. టైల్స్ శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగించడం మంచిది.

తగినంత బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి మందపాటి పేస్ట్ లా చేసి, మురికి ఉన్న చోట అప్లై చేయండి. దీనిపై కొంచెం వెనిగర్ కూడా స్ప్రే చేయండి. 10 నిమిషాల తర్వాత, దానిని స్క్రబ్ తో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఫ్లోర్ తెల్లగా మెరిసిపోతుంది.


2. గ్యాస్ చుట్టూ శుభ్రం చేయండి :
గ్యాస్ తో పాటు గిన్నెలు పెట్టుకునే ప్రాంతం పాలరాయి లేదా గ్రానైట్ వంటి సహజ రాయితో తయారు చేయబడతాయి. ఏ రకమైన మురికి పడినా వీటిపై సులభంగా అతుక్కుపోయి ఫంగస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రాంతంలో క్రమంగా నల్లగా మారుతుంది. అందుకే గ్యాస్ చుట్టు ప్రక్కల పడిన ఏ ద్రవాన్ని అయినా సరే వెంటనే శుభ్రం చేయండి . శుభ్రపరచడానికి గోరువెచ్చని నీటిని వాడండి. దీంతో పాటు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. మరకలపై ఆమ్లత్వం ఉన్న క్లీనర్‌లను ఉపయోగించవద్దు. ఇవి రాయి యొక్క పాలిష్‌ను మసకబారుస్తాయి.

3. కిచెన్ సింక్ ని రోజూ శుభ్రం చేయండి:
ఇంట్లోని పాత్రలను ప్రతి రోజూ ఉపయోగిస్తారు. గిన్నెలు కడిగిన తర్వాత రోజుకు ఒకసారి కిచెన్ సింక్‌ను పూర్తిగా శుభ్రం చేయాలి. దీనివల్ల సింక్‌లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటుంది. అంతే కాకుండా సింక్ నుండి చెడు వాసన కూడా బయటకు రాకుండా ఉంటుంది. సింక్‌లో చిక్కుకున్న మురికిని శుభ్రం చేయడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా ఉంటుంది.

1 టీస్పూన్ బేకింగ్ సోడాను 1/4 నిమ్మకాయ రసంతో కలిపి సింక్‌లో పోసి కాసేపు అలాగే ఉంచండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిని సింక్‌లో పోస్తే.. మురికి మొత్తం తొలగిపోతుంది.

4. ప్రతి వారం క్యాబిన్‌లను శుభ్రం చేయండి:
వారానికి ఒక సారి మీరు కిచెన్‌లో ఉన్న సెల్ఫ్ ( క్యాబిన్ )లను శుభ్రం చేసుకోండి. వంట చేసినప్పడు వచ్చే పొగ వీటిలోకి చేరి దుమ్ము పేరుకుపోతుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. వెనిగర్ బ్యాక్టీరియా, ఫంగస్‌లను చంపే సహజ క్లెన్సర్ గా పని చేస్తుంది.
ప్రతి వారం 2 కప్పుల గోరువెచ్చటి నీరు తీసుకుని అందులో 1 కప్పు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కలిపి స్ప్రే చేయండి.5 నిమిషాల తర్వాత స్పాంజితో శుభ్రం చేసుకోండి.

5. స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులను పాలిష్ చేస్తూ ఉండండి:
ఫ్రిజ్, ఓవెన్, డిష్‌వాషర్ వంటి వస్తువులను పాలిష్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై క్లీనర్‌ను స్ప్రే చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత ఒక క్లాత్‌తో శుభ్రం చేయండి.

6. ఫ్రిజ్ క్లీనింగ్:

ఫ్రిజ్ యొక్క అల్మారాల్లో ప్లాస్టిక్ షీట్లు లేదా లైనింగ్‌లను ఉంచండి. ఇలా చేస్తే ఫ్రిజ్ శుభ్రపరచడం సులభం చేస్తుంది. దీని కోసం షెల్ఫ్‌కు సులభంగా అంటుకునే క్లాంగ్ ఫిల్మ్‌ను ఉపయోగించండి.

7. తెల్లటి నీటి మరకలు:
కొన్ని సార్లు మీ గిన్నెలు, సింక్‌పై తెల్లటి మరకలు కనిపిస్తుంటాయి. వీటిని తొలగించడానికి వెనిగర్‌ను కాగితపు టవల్‌లో నానబెట్టి, మరకపై 20 నిమిషాల నుండి 1 గంట వరకు అప్లై చేయండి. టూత్ బ్రష్ తో స్క్రబ్ చేయండి.

Also Read: జిడ్డుగా ఉన్న పాత్రలైనా ఇలా చేస్తే.. క్షణాల్లోనే కొత్త వాటిలా మెరుస్తాయ్

8. మాడిన గిన్నెలు:
బాగా రంగు మారి నల్లగా మారిన పాత్రలను సులభంగా శుభ్రం చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను రెండు టేబుల్ స్పూన్ల క్రీమ్ ఆఫ్ టార్టార్ తో కలిపి పాత్రలకు పూయండి. ఒకటి లేదా రెండు చుక్కల డిష్ వాష్ సోప్ వేసి కొంచెం గోరువెచ్చని నీటితో కలపండి. అది పేస్ట్ లా అవుతుంది. తర్వాత పాత్రలపై కొన్ని నిమిషాలు స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోండి.

Related News

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Big Stories

×