Younis Khan: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Pakistan Super League 2026 Tournament) జరుగుతున్న నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాపైన (Naseem Shah ) 67 లక్షల ఫైన్ ( 20 million PKR fine ) విధించింది PCB బోర్డు. పాకిస్తాన్ లో ఉన్న బడా రాజకీయ నాయకురాలు మరియం నవాజ్ షరీఫ్ ను ( Maryam Nawaz Sharif) ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టాడు నసీమ్ షా. దీంతో వెంటనే రియాక్ట్ అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్… అతనిపై చర్యలకు పూనుకుంది. 67 లక్షల రూపాయల ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంత మొత్తంలో ఫైన్ వేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ ( Younis Khan) తన స్టైల్లో స్పందించారు. ఇంత మొత్తంలో నసీమ్ షా ఫైన్ చెల్లించుకోలేడని పేర్కొన్నారు. ఈ రేంజ్ లో ఫైన్ వేసినందుకు మొహ్సీన్ నఖ్వీకి సిగ్గు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత డబ్బు చెల్లించడం కంటే క్రికెట్ నుంచి నసీమ్ షా వైదొలగడం బెటర్ అని సూచనలు చేశారు.
Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాలను తయారు చేస్తా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మరియం నవాజ్ షరీఫ్ పైన వివాదాస్పద పోస్టు పెట్టినందుకు గాను 67 లక్షల ఫైన్… నసీమ్ షా పైన వేశారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యునిస్ ఖాన్ స్పందించారు. చిన్న పోస్టుకే రూ. 67 లక్షల ఫైన్ విధిస్తారా ? అంత మొత్తంలో డబ్బు నసీమ్ షా ఎక్కడి నుంచి తీసుకువస్తాడని ప్రశ్నించారు. నసీమ్ షాను నిలువున కోసినా కూడా ఒక్క రూపాయి రాదని బాంబు పేల్చారు. అతని దగ్గర డబ్బులు వసూలు చేయడం కంటే మొహ్సీన్ నఖ్వీని ఉరితీయాలని ఫైర్ అయ్యారు. సాధారణ క్రికెటర్ పైన రూ. 67 లక్షల ఫైన్ ఎవరైనా వేస్తారా ? అని ప్రశ్నించారు.
పరోక్షంగా నసీమ్ షా కెరీర్ అంతం చేసేందుకు ఇలా కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఫైన్ విత్ డ్రా చేసుకోవాలని కోరారు. పాకిస్తాన్ క్రికెట్ లో రాజకీయ జోక్యం ఎక్కువైందని.. అందుకే ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని మొహ్సీన్ నఖ్వీ పై సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని మొహ్సీన్ నఖ్వీకి చురకలు అంటించారు. అన్యాయంగా నసీమ్ షాను బలి పశువు చేశాడని ఫైర్ అయ్యారు. మరియం నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టిన వెంటనే డిలీట్ చేశాడు కదా..? మళ్లీ ఎందుకు యాక్షన్ తీసుకున్నారని ఫైర్ అయ్యారు. దీంతో యూనిస్ ఖాన్ వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మరియం నవాజ్ షరీఫ్ ఓపెనింగ్ సెర్మనీకి వచ్చారు. ఈ సందర్భంగా మరియంకు మర్యాదలు అవసరమా ? ఆమె ఏమైనా మహారాణినా ? అంటూ వివాదస్పద పోస్ట్ పెట్టారు. కాగా మాజీ ప్రధాని కూతురే ఈ మరియం నవాజ్ షరీఫ్. ఈ తరుణంలోనే పీసీబీ వెంటనే యాక్షన్ తీసుకుంది.
Also Read: PSL 2026: PSLను అతలాకుతలం చేసిన తుఫాన్..గాల్లో ఎగిరిపడ్డ గ్రౌండ్ మెన్లు