E-Paper
Advertisement

Wedding Season: నెలన్నర రోజులు.. 46 లక్షల పెళ్లిళ్లు.. రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం

Wedding Season: నెలన్నర రోజులు.. 46 లక్షల పెళ్లిళ్లు.. రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం

పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. ఈ సీజన్ లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య భారీగా ఉన్నట్టు అంచనా. దేశవ్యాప్తంగా ఈ నెలన్నర రోజుల్లో దాదాపు 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంటున్నారు. గతేడాది ఈ సీజన్ తో పోల్చి చూస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే అయినా పెళ్లిళ్లకు పెట్టే ఖర్చు మాత్రం బాగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఈ సీజన్ లో దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగబోతుందని తెలుస్తోంది.

కాస్ట్ లీ మ్యారేజెస్..
పెళ్లి ఇప్పుడు కాస్ట్ లీ వ్యవహారంగా మారిపోయింది. ప్రీవెట్టింగ్ షూట్ తో మొదలయ్యే ఈ తంతు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ తో ముగుస్తుంది. పెళ్లి దుస్తుల్ని తయారు చేసే డిజైనర్లు, పెళ్లి వీడియోలను సినిమాలకంటే ఇంకా గొప్పగా తీసే ఫొటోగ్రాఫర్లు, సినిమా సెట్టింగుల్లా మారిపోయిన పెళ్లి పందిళ్లు.. ఇలా అన్నిట్లో మార్పు వచ్చింది. ఆ మార్పే పెళ్లి వ్యవహారాన్ని అత్యంత ఖరీదుగా మార్చేసింది.

రాష్ట్రాల బడ్జెట్ లను మించిపోయేలా?
2025-26 సంవత్సరానికి సంబంధించి ఏపీ బడ్జెట్ 3.2 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఒక ఏడాదిలో ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకోసం ఖర్చు చేయాలనుకుంటున్న మొత్తం అది. అలాంటిది కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో పెళ్లిళ్ల కోసం రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం అంటే మాటలా. రాష్ట్రాల బడ్జెట్ నే తలదన్నేలా ఇప్పుడు పెళ్లిళ్ల బడ్జెట్ లు మారిపోయాయి. ఒక్క ఢిల్లీ లోనే ఈ సీజన్ లో దాదాపు 4.8 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. ఈ పెళ్లిళ్ల కోసం 1.8 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ (CAIT) అంచనా వేసింది.

పెళ్లిళ్లలో ఏయే విభాగానికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారంటే
దుస్తులు, చీరలు: 10 శాతం
ఆభరణాలు: 15శాతం
ఎలక్ట్రానిక్స్, ఎలెక్ట్రికల్స్: 5శాతం
డ్రై ఫ్రూట్, స్వీట్స్: 5శాతం
కిరాణా సరకులు, కూరగాయలు: 5శాతం
బహుమతులు: 4 శాతం
ఇతర వస్తువులు: 6శాతం
ఈవెంట్ మేనేజ్‌మెంట్: 5శాతం
కేటరింగ్: 10శాతం
ఫోటోగ్రఫీ, వీడియో: 2శాతం
ట్రావెల్, హాస్పిటాలిటీ: 3శాతం
పుష్పాలతో అలంకరణ: 4శాతం
సంగీతం, ఆర్క్రెస్ట్రా: 3శాతం
లైట్ & సౌండ్: 3శాతం
ఇతర సేవలు: 3శాతం

ఇక ప్రాంతాల వారీగా లెక్కలు తీస్తే, ఢిల్లీ వాసులు ప్రధానంగా ఆభరణాలు, ఫ్యాషన్, వెడ్డింగ్ వెన్యూపై అధికంగా ఖర్చు చేస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్ వాసులు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వాసులు సంప్రదాయ అలంకరణలకు, కేటరింగ్ పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్యాంకెట్ సేవలకోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర దక్షిణ రాష్ట్రాల్లో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ గుడిలో పెళ్లిళ్లు ఫేమస్.

Also Read: హైదరాబాద్‌కు జగన్.. కోర్టుకు వెళ్లకుండా, కొత్త ప్లాన్?

Also Read: కారుమూరి విడుదల.. వైసీపీ సంబరపడాల్సిన అవసరం ఉందా?

కోటిమందికి ఉపాధి..
ఈ పెళ్లిళ్ల సీజన్ లో తాత్కాలికంగా కోటిమందికి ఉపాధి లభిస్తుందని తెలుస్తోంది. డెకరేటర్లు, కేటరర్లు, ఫ్లోరిస్ట్‌లు, కళాకారులు, ట్రాన్స్‌పోర్టర్లు, హాస్పిటాలిటీ వర్గాలకు డిమాండ్ పెరుగుతోంది. దుస్తులు, ఆభరణాలు, హ్యాండీక్రాఫ్ట్స్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉన్న MSMEలకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. CAIT అంచనాల ప్రకారం, ఈ 45 రోజుల పెళ్లి సీజన్ ద్వారా ప్రభుత్వానికి రూ.75,000 కోట్లు పన్ను రూపంలో సమకూరబోతోంది.

Also Read: బాబు, లోకేష్, పవన్, జగన్.. ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులున్నారు?

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×