E-Paper
Advertisement

AP Leaders In Other States: బాబు, లోకేష్, పవన్, జగన్.. ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులున్నారు?

AP Leaders In Other States: బాబు, లోకేష్, పవన్, జగన్.. ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులున్నారు?
Advertisement

ఏపీకి చెందిన రాజకీయ నేతలు పక్క రాష్ట్రలకు ఎందుకు వెళ్తున్నారు, వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారు, వస్తే తిరిగి ఎన్నాళ్లుంటారు. ఈ లెక్కలతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ లెక్కలు మరింత పక్కాగా రెడీ అవుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఎక్కువగా బెంగళూరులో మకాం వేయడంతో వీకెండ్ పాలిటిక్స్ అనే అంశం బాగా హైలైట్ అవుతోంది. నిరసన కార్యక్రమాలు, పరామర్శలు ఉన్నప్పుడు మాత్రమే జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు. అవి పూర్తి చేసుకుని తిరిగి ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్లిపోతున్నారు. అసలు ప్రతిపక్ష నేత ప్రజల్లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్ లో ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ రియాక్షన్..
తాజాగా వైసీపీ అధికారికంగా ఒక పోస్టర్ పెట్టింది. ఆంధ్రా ప్రజల సొమ్ముతో.. పక్కా రాష్ట్రంలో బాబు, పవన్ కల్యాణ్, లోకేష్ జల్సాలు అంటూ ట్వీట్ చేసింది. వీకెండ్ వస్తే చాలు స్పెషల్ ప్లైట్‌లో హైదరాబాద్‌కి ముగ్గురూ జంప్ అని కామెంట్ పెట్టింది. ఎవడి అబ్బ సొమ్ము అని ఇలా ప్రజాధనాన్ని తగలేస్తున్నారంటూ ప్రశ్నించింది. 17 నెలల వ్యవధిలో చంద్రబాబు 80సార్లు, లోకేష్ 83సార్లు, పవన్ 104 సార్లు హైదరాబాద్ వెళ్లారని లెక్క తేల్చింది.

Advertisement

టార్గెట్ పవన్..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నుంచి ఇలాంటి విమర్శలే వినపడ్డాయి. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా పవన్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ పోస్టింగ్ లు పెడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో, ప‌వ‌న్ కళ్యాణ్ హైదరాబాద్–విజయవాడ మధ్య మొత్తం 104 సార్లు ప్రత్యేక విమానంలో చక్కర్లు కొట్టారని వైసీపీ పోస్టింగ్ లు పెడుతోంది. పవన్ కళ్యాణ్ – VSR వెంచర్స్ కలిసి కొనుగోలు చేసినట్లు చెబుతున్న ప్రత్యేక విమానం లోనే ఈ ప్రయాణాలు జరుగుతున్నాయని, హైదరాబాద్–విజయవాడ రౌండ్ ట్రిప్‌కు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని, పవన్ 104 సార్లు ప్రయాణించినందుకు గాను మొత్తం వ్యయం సుమారు రూ. 8.50 కోట్లు అని, ఇదంతా ప్రభుత్వ ఖజానా కి భారీ చిల్లుగా మారిందని వైసీపీ కామెంట్ చేస్తోంది.

Advertisement

జనసేన రియాక్షన్..
నేరుగా పవన్ ని టార్గెట్ చేయడంతో జనసేన నుంచి వైసీపీకి కౌంటర్ వెంటనే పడింది. వైసీపీ కూడా ఓ లిస్ట్ రెడీ చేసి జగన్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చి 17 నెలల 15 రోజులు అవుతున్న క్రమంలో జగన్ బెంగళూరు పారిపోయి సుమారు 16 నెలల 11 రోజులు అయిందని జనసేన లెక్క తేల్చింది. అసెంబ్లీ సమావేశాలకు వచ్చింది 10 నిముషాలు మాత్రమే అని, అది కూడా సంతకం పెట్టి పారిపోడానికే సరిపోయిందని, కర్నాటక రాష్ట్రం బెంగళూరు యెలహంక ప్యాలెస్ లో ఉన్నది మాత్రం 470 రోజుల పైనే అని జనసేన అంటోంది. ఆంధ్రాలో ఉన్నది అటు ఇటుగా 50 రోజులు, పులివెందులలో మెరిసింది మూడు సార్లు అని వివరించింది. బెంగళూరు – విజయవాడ అప్ అండ్ డౌన్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడానికా పులివెందుల ప్రజలు గెలిపించింది? అంటూ జనసేన ప్రశ్నించింది.

పవన్ ని తెలంగాణ వెళ్తున్నారంటూ విమర్శిస్తున్న వైసీపీ, అదే రాష్ట్రానికి అక్రమాస్తుల కేసులో విచారణకు వెళ్తున్న జగన్ ని వెనకేసుకొస్తేందని, సిగ్గు లేకుండా ఘన స్వాగతాలు, భారీ ర్యాలీలకు జనసమీకరణలు చేసుకుంటున్నారని.. పవన్ ని విమర్శించడానికి వారికి కాస్తయినా మొహమాటం అనిపించలేదా అని జనసేన ప్రశ్నిస్తోంది.

Also Read: హైదరాబాద్‌కు జగన్.. కోర్టుకు వెళ్లకుండా, కొత్త ప్లాన్?

Also Read: కారుమూరి విడుదల.. వైసీపీ సంబరపడాల్సిన అవసరం ఉందా?

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×