E-Paper
Advertisement

Karumuri Bail: కారుమూరి విడుదల.. వైసీపీ సంబరపడాల్సిన అవసరం ఉందా?

Karumuri Bail: కారుమూరి విడుదల.. వైసీపీ సంబరపడాల్సిన అవసరం ఉందా?
Advertisement

పరకామణి చోరీ కేసు, తదనంతర పరిణామాలకు సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు, చివరకు మేజిస్ట్రేట్ సూచనతో బెయిల్ పై విడుదల చేశారు. తనను రిమాండ్ కి తరలిస్తారనే అనుమానం కారుమూరిలో కూడా ఉన్న మేజిస్ట్రేట్ నిర్ణయంతో ఆయన జైలుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ ఎపిసోడ్ తో వైసీపీ విజయం సాధించిందని, ప్రభుత్వం పెడుతున్న కేసులు అక్రమం అని తేలిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కారుమూరికి బెయిల్ వచ్చినంత మాత్రాన ప్రభుత్వం తప్పు చేసినట్టు అవుతుందా? పోనీ ఆయన బెయిల్ పై విడుదలైనంత మాత్రాన వైసీపీకి వచ్చిన లాభమేంటి అనేది తేలాల్సి ఉంది.

https://twitter.com/YSRCParty/status/1990861081397375418?s=20

Advertisement

మీడియాలో చర్చ..
వైసీపీ సొంత మీడియా సాక్షితోపాటు ఇతర ఛానెళ్లలో జరుగుతున్న చర్చల్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తప్పుల్ని ఆపాదిస్తూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్లే ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. పరకామణి దొంగతనం కేసులో రాజీ చేసుకున్న నిందితుడిపై ఫిర్యాదు చేసిన అధికారి హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. అయితే అది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కారుమూరి వెంకట్ రెడ్డి తీర్మానించారు. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈ హత్య జరిగిందన్నారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు కేసు పెట్టారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అది బెయిలబుల్ కేసు కావడంతో మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అంతమాత్రాన వైసీపీ గెలిచినట్టు అవుతుందా..?

వైసీపీ వ్యూహం ఏంటి?
ఎన్నికల నాటికి ఎన్ని అరెస్ట్ లు జరిగితే వైసీపీకి అంత మంచిది అని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి అరెస్ట్ తర్వాత వారికి వకాల్తాగా వస్తున్న అంబటి రాంబాబు, ఆరె శ్యామల వంటి నేతలు అరెస్ట్ లకు తాము భయపడేది లేదంటున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా తమ గొంతు ఆపబోమంటున్నారు. ఒకరకంగా ఇది సొంత పార్టీలోని నేతల్ని రెచ్చగొట్టడమే అనుకోవాలి. ఈ వ్యూహంతోనే వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అనవసరమైన కేసుల్లో ఇరుక్కొంటున్నారు.

Advertisement

అప్పట్లో రప్ప రప్ప అంటూ ప్రజల్ని రెచ్చగొట్టేలా స్లోగన్లు రాసినందుకు కొంతమందిని పోలీసులు పిలిపించారు. అయితే ఆ రప్ప రప్పని సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్ సమర్థించడం, పుష్ప సినిమా డైలాగ్ రాసి తెచ్చినంత మాత్రాన అదేమైనా తప్పా అని ప్రశ్నించడం విశేషం. పార్టీ అధినేత సహా ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంది. మిగతా కొంతమంది నేతలు, కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కష్టాలు కోరితెచ్చుకుంటున్నారు.

Also Read: ఎన్డీఏలో కీలకంగా లోకేష్.. బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం

Also Read: I-బొమ్మస్థానంలో J-బొమ్మ, N-బొమ్మ..

రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే, నిజంగానే కూటమి కక్ష తీర్చుకోవాలనుకుంటే నేరుగా జగన్ నే ఏదో ఒక కేసులో ఇరికించి ఉండేది కదా? ఇలా ఇతర నేతలపై ప్రతాపం చూపించదు కదా? ఈ లాజిక్ ని వైసీపీ కార్యకర్తలు గుర్తిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు టీడీపీ నేతలు.

Also Read: రేపు హైదరాబాద్‌కు జగన్.. కోర్టుకు వెళ్లకుండా, కొత్త ప్లాన్?

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×