Meera Vasudevan: మలయాళ నటి మీరా వాసుదేవన్ ఈ మధ్య వార్తలో బాగా నిలిచిన విషయం తెల్సిందే. 20 ఏళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకొని.. ఇటీవలే మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చి.. ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాను అని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. సినిమాలకన్నా పెళ్లిళ్ల ద్వారానే ఆమె బాగా ఫేమస్ అయ్యింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీరా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తాను నటించిన సినిమాల గురించి, హీరోలతో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది.
మీరా వాసుదేవన్ కెరీర్ లో తన్మాత్ర సినిమా మంచి హిట్ అందుకుంది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాకు బ్లేస్సి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు అవార్డులు కూడా అందుకుంది. ఇందులో మోహన్ లాల్ నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా ఈ సినిమాలో మోహన్ లాల్ నగ్నంగా నటించాడని, దానికి ఆయన క్షమించమని కోరినట్లు చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో మోహన్ లాల్ అల్జీమర్స్ వచ్చిన వ్యక్తిగా కనిపిస్తాడు. మొదటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట, అందమైన కుటుంబం.. ఆ ఇంటి యజమానికి అల్జీమర్స్ రావడంతో భార్యను, సొంత పిల్లలను గుర్తుపట్టలేకపోతాడు.దానికి మించిన నరకం మరొకటి ఉండదు. అందుకే ఈ సినిమా చూసినవారందరూ తాము చాలా డిస్ట్రబ్ అయ్యినట్లు తెలిపారు. ఇందులో ఒక సీన్ ఉంటుంది.. భార్యాభర్తలు ప్రతిరాత్రి శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కానీ, ఒకరోజు ఇద్దరు నగ్నంగా ఉన్నప్పుడు హీరోకి.. గోడపై ఒక బల్లి కనిపిస్తుంది. దాన్ని చూడగానే అతని ఫోకస్ మారుతుంది. దాన్నే వెంబడించుకుంటూ వెళ్ళిపోతాడు. బెడ్ పై భార్య ఉంది .. తాను నగ్నంగా ఉన్నాను అనే విషయం అతనికి గుర్తు ఉండదు. ఆ సీన్ కోసం మోహన్ లాల్ నగ్నంగా ఉండాల్సి వచ్చింది.
ఇక ఆ సీన్ కోసం మోహన్ లాల్ చాలా కష్టపడ్డాడని మీరా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ సీన్ చేసేముందు తనకు సారీ కూడా చెప్పినట్లు తెలిపింది. ” నగ్నంగా ఉండే సీన్ చెప్పినప్పుడు డైరెక్టర్ ను అడిగాను.. అలా చేయడంఅవసరమా.. ? ఆ సీన్ అంత ముఖ్యమా.. ? అంటే. అవును చాలా ముఖ్యం. అప్పుడే భార్య.. భర్తలో మార్పు గమనిస్తుంది. తన భార్య స్పర్శను కూడా మర్చిపోయి.. ఎలా వెళ్ళాడు అనేది చూపించాలి అని చెప్పారు. నాకు అప్పుడు అర్ధమయ్యింది. నేను అయితే దుప్పటి కప్పుకొని ఉంటాను. మోహన్ లాల్ సార్ నగ్నంగా చేయాలి. అది చాలా కష్టం. ఆ సీన్ కు ముందే ఆయన నా దగ్గరకు వచ్చి.. నీకు ఇబ్బంది కలిగితే క్షమించు అని చెప్పారు. అక్కడ అతికొద్దిమంది స్టాఫ్ ను ఉంచారు. అలా ఆ సీన్ ను మోహన్ లాల్ సార్ పూర్తి చేశారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.