E-Paper
Advertisement

Sleep Meditation: నిద్రలేమికి గుడ్ బై చెప్పండి.. 5 నిమిషాల మెడిటేషన్‌తో గాఢనిద్ర మీ సొంతం

Sleep Meditation: నిద్రలేమికి గుడ్ బై చెప్పండి.. 5 నిమిషాల మెడిటేషన్‌తో గాఢనిద్ర మీ సొంతం
Advertisement

Sleep Meditation: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో.. నిద్ర లేమి ఒక సాధారణ సమస్యగా మారింది. శ్రమ, పని ఒత్తిడి, మొబైల్ , ల్యాప్‌టాప్ స్క్రీన్‌లు.. నిరంతరం పరుగెత్తే ఆలోచనలు అన్నీ మన రాత్రి నిద్రను దోచుకుంటాయి. ఫలితంగా శరీరం కూడా అలసిపోతుంది. కానీ మనం పడుకున్న వెంటనే.. మనస్సు అకస్మాత్తుగా పూర్తిగా చురుగ్గా మారుతుంది. కొన్నిసార్లు మాత్రం రేపు ఏం జరుగుతుందో అనే ఆలొచన, కొన్నిసార్లు భవిష్యత్తు గురించిన బెంగ వంటివి నిద్ర రాకుండా చేస్తాయి.

ఈ సమస్యతో బాధపడుతున్న చాలా మంది వెంటనే నిద్ర మాత్రలు లేదా వారి మొబైల్ ఫోన్‌లను స్క్రోల్ చేయడం వైపు మొగ్గు చూపుతారు. కానీ ఈ రెండు దీర్ఘకాలంలో హానికరం. వాస్తవానికి.. మనస్సును ప్రశాంతపరిచే, నిద్రకు సిద్ధం చేసే సాధారణ 5 నిమిషాల అలవాటు ఇందుకు చాలా అవసరం. ఈ అలవాటే ధ్యానం.

Advertisement

5 నిమిషాల ధ్యానం:
పడుకునే ముందు కేవలం ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనస్సు, శరీరం రెండింటిపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ధ్యానం అంటే కష్టమైన యోగాసనాల్లో పాల్గొనడం అని అర్థం కాదు. మంచం మీద హాయిగా కూర్చోవడం లేదా పడుకోవడం, కళ్ళు మూసుకోవడం, మీ శ్వాసపై దృష్టి పెట్టడం అవసరం. ఈ సమయంలో మీ శ్వాసను వేగవంతం చేయకూడదు. లేదా నెమ్మది చేయకూడదు. గాలి లోపలికి, బయటికి కదులుతున్నట్లు అనుభూతి చెందండి.

ఇలా చేయడం వల్ల కొన్ని నిమిషాల్లో.. మనస్సు రోజులోని గందరగోళం నుంచి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఆలోచనలు క్రమంగా నెమ్మదిస్తాయి. హృదయ స్పందన సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతే కాకుండా శరీరం అది మీ విశ్రాంతి సమయం అని సూచించడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ మనస్సును యాక్టివ్ మోడ్ నుంచి రిలాక్స్డ్ మోడ్‌కు మారుస్తుంది.

Advertisement

Also Read: ఆరోగ్యకరమైన డైట్ అంటే అన్నం మానేయడమేనా ? నిపుణులు ఏం చెబుతున్నాంటే ?

నిద్రలేమికి పరిష్కారాలు :
ధ్యానం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. ఇది ఆందోళన, భయాన్ని దూరం చేస్తుంది. మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల మనస్సు అప్రమత్తంగా ఉన్నట్లే.. ధ్యానం కూడా మనస్సును ప్రశాంత పరుస్తుంది. ధ్యానం ప్రభావాలు కనిపించడానికి వారాల సమయం పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే కేవలం 5 నిమిషాల ధ్యానం కూడా తక్షణ విశ్రాంతిని ఇస్తుంది.

ఈ సమస్యల నుంచి ఉపశమనం:
మీరు ప్రతిరోజూ పడుకునే ముందు ఈ సాధారణ అలవాటును పాటిస్తే.. నిద్ర లేమి తొలగిపోతుంది. అంతే కాకుండా మీరు రాత్రి త్వరగా నిద్రపోతారు. అదనంగా.. మీ నిద్ర మధ్యలో మేల్కునే పరిస్థితి కూడా మీకు ఎదురుకాకుండా ఉంటుంది. ఫలితంగా మీరు ఉదయం తేలికగా, ఉత్సాహంగా మేల్కొంటారు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×