E-Paper
Advertisement

Gandhi Talks release date: కమల్ హాసన్ లాంటి ప్రయోగానికి సిద్ధమైన విజయ్ సేతుపతి..!

Gandhi Talks release date: కమల్ హాసన్ లాంటి ప్రయోగానికి సిద్ధమైన విజయ్ సేతుపతి..!
Advertisement

Gandhi Talks release date: భారతీయ సినిమా చరిత్రలో పుష్పక విమానం.. ఒక అపూర్వమైన ప్రయోగం. మాస్.. కమర్షియల్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న కాలంలో.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో.. కమల్ హాసన్ చేసిన ఆ మూకీ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మాటలు లేకుండానే భావాలను.. చెప్పొచ్చని ఆ చిత్రం నిరూపించింది. కాలక్రమంలో సినిమాల్లో కమర్షియాలిటీ.. పెరుగుతూ వచ్చింది. అందుకే ఇప్పట్లో పెద్దగా ప్రయోగాత్మక సినిమా రావడం లేదు. హీరో చుట్టూనే తిరిగే కథలే బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రయోగాలకు.. ముందుకు రావడం చాలా అరుదుగా మారింది.

అలాంటి సాహసానికే ఇప్పుడు గాంధీ టాక్స్.. టీమ్ సిద్ధమైంది. ఇటీవల భ్రమయుగం లాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మమ్ముట్టి తరహాలోనే.. మాటలు లేకుండా కథ చెప్పే ప్రయత్నం ఇది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కిషోర్ పి. బేలేకర్ ఈ కథను ఎంతో సున్నితంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Advertisement

టీజర్‌లో “వాళ్లు మౌనంగా ప్రేమిస్తారు.. మౌనంగానే పాపం చేస్తారు.. మౌనంగానే బాధపడతారు” అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. మాటలు లేకుండా మనుషుల జీవితాల్లో జరిగే సంఘర్షణలను చూపించడమే ఈ సినిమా లక్ష్యం అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. నేటి సమాజంలో డబ్బు.. అవసరాలు..విలువలు ఎలా మనిషిని ప్రభావితం చేస్తున్నాయో కొత్త కోణంలో చూపించబోతున్నారనే సంకేతాలు టీజర్ ఇచ్చింది.

ALSO READ: Prabhas Herione: ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్ ప్రియురాలి చెల్లి… ఇన్‌‌స్టాలో రొమాంటిక్ ఫోటోలు వైరల్

Advertisement

ఇలాంటి మూకీ సినిమాల్లో అసలు బాధ్యత సంగీత దర్శకుడిదే. ఎక్కడ సంగీతం వినిపించాలో కాదు.. ఎక్కడ ఆపాలో తెలిసినవాడే నిజమైన సంగీత దర్శకుడు.. అన్న మాటలను గుర్తు చేసేలా..ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్‌లో ‘రఘుపతి రాఘవ రాజారాం’ను వాయిద్య రూపంలో వినిపించిన తీరు చాలా ఆకట్టుకుంది. చివర్లో వినిపించే కాయిన్ సౌండ్ కథలోని లోతైన భావాన్ని సూచిస్తుంది.

జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాటలు లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో కాలమే చెప్పాలి. కానీ ప్రయోగాత్మక సినిమాలను ఆదరించే వారికి ‘గాంధీ టాక్స్’ ఒక గుర్తుండిపోయే అనుభవంగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి సినిమాలు అంటే మంచి నమ్మకం ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ హీరో నుంచి వచ్చిన మహారాజ్ సినిమా కూడా బాగానే ఆడింది. ఈ క్రమంలో ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఏలుతున్న తరుణంలో.. ఇలాంటి కథతో వచ్చి విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×