E-Paper
Advertisement

పోపుల పెట్టెలోని ఈ ‘చిన్న గింజల నీరు’.. మీ గుండెకు శ్రీరామరక్ష!

పోపుల పెట్టెలోని ఈ ‘చిన్న గింజల నీరు’.. మీ గుండెకు శ్రీరామరక్ష!
Advertisement

Mustard seed water: ఆవాలు లేనిదే కూరకు రుచి రాదు. అయితే.. ఆవాలు రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో ఆవాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీ యాకిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లె రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ఉపయోగపడతాయి. డైలీ ఆవాల నీరు తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యానికి ఆవాల నీరు:

Advertisement

ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు ఒత్తిడి అంతే కాకుండా తినే ఆహారం వంటివి చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మన పూర్వీకులు పాటించిన సహజ పద్దతులను అనుసరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాలలో ఉండే పోషకాలు గుండెను ఎలా రక్షిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ నియంత్రణ:
ఆవాలలో విటమిన్ b3 పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఆవాల నీటిని క్రమం తప్పకుండాతీసుకోవడం వల్ల రక్త నాళాల్లో కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ కూడా సాఫీగా జరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Advertisement

హైబీపీ:
ఆవాలలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి మెగ్నీషియం రక్తనాళాలను ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా హైబీపీ సమస్య ఉన్నవారికి ఇది సహజమైన చికిత్సగా కూడా పని చేస్తుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా-3 చేపలలో పుష్కలంగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ తినని వారికి ఆవాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ గుండె లయను క్రమబద్ధీకరించడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా గుండె వాపును తగ్గించడంలో ఉపయోగపడతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు:
ఆవాలలో సెలీనియం అంతే కాకుండా గ్లూకోసినోలేట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, గుండె కండరాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా గుండె కణజాలం ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతో అవసరం అవుతాయి.

ఆవాల నీటిని ఎలా తయారు చేయాలి?
ఆవాల నీటిని తయారు చేయడం చాలా ఈజీ. దీనిని రెండు పద్ధతుల్లో తీసుకోవచ్చు.

1.ఒక టీస్పూన్ నల్ల ఆవాలను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి.

2.ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ ఆవాల పొడిని కలిపి.. దానిని కొద్దిగా వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగవచ్చు.

Also Read: బలమైన ఆహారమే.. కానీ మీ కిడ్నీలకు శాపంగా మారే అవకాశం! మినప్పప్పు వెనక ఉన్న చేదు నిజం

ఆవాల నీరు ప్రయోజనాలు:
జీర్ణక్రియకు మేలు: ఆవాలు లాలాజల ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

కీళ్ల నొప్పులు: ఇందులో ఉండే సెలీనియం, మెగ్నీషియం వాపులను తగ్గించి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

శ్వాసకోశ సమస్యలు: జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఆవాల నీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులలోని కఫం కరుగుతుంది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×