E-Paper
Advertisement

బలమైన ఆహారమే.. కానీ మీ కిడ్నీలకు శాపంగా మారే అవకాశం! మినప్పప్పు వెనక ఉన్న చేదు నిజం

బలమైన ఆహారమే.. కానీ మీ కిడ్నీలకు శాపంగా మారే అవకాశం! మినప్పప్పు వెనక ఉన్న చేదు నిజం
Advertisement

Black gram side effects: మినుముల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే మినుములు ఆరోగ్యానికి మంచివని భావిస్తారు. కానీ మినుములను ఎక్కువగా తిన్నా లేదా తప్పుగా తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. జీర్ణ సమస్యల నుంచి బరువు పెరగడం వంటి వాటికి ఇవి కారణం అవుతాయి. అంతే కాకుండా కొంత మందికి అలర్జీతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకే మినుములు తినే ముందు వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మినుములు ఎక్కువగా తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

Advertisement

1.జీర్ణ సమస్యలు:
మినుముల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కానీ అతిగా తింటే.. గ్యాస్ , కడుపు ఉబ్బరంతో పాటు బ్లోటింగ్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

2.అధిక బరువు:
కార్బోహైడ్రేట్లతో పాటు కాలరీలు కూడా మినుముల్లో అధిక మోతాదులో ఉంటాయి. ఈ కారణం వల్ల ఎక్కువగా తింటే బరువు ఈజీగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునే వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. మినుములు ఎక్కువగా తినడం వల్ల ఫ్యాట్ నిల్వలు పెరుగుతాయి. అందుకే మితంగా తీసుకోవడం మంచిది.

Advertisement

3. కిడ్నీ సమస్యలు ఉన్నవారు:
మినుముల్లో పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఎక్కువగా తింటే మాత్రం కిడ్ని పనితీరుపై చాలా వరకు ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా మంచిది.

4. అలర్జీ సమస్యలు:
కొంతమందికి మినుములు అలర్జీ కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాకుండా చర్మంపై దద్దుర్లు, దురద, వాంతుల వంటి వాటిని కూడా కలిగిస్తాయి. అలర్జీ సమస్యలు ఉన్న వారు మినుములకు దూరంగా ఉండటం మంచిది.

5.యూరిక్ యాసిడ్ పెరగడం:
మినుముల్లో ఫ్యూరిన్స్ ఉంటాయి కాబట్టి ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచే అవకాశం కూడా ఉంటుంది. గౌట్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.

6. గర్భిణీలు:
గర్భధారణ సమయంలో మినుములు ఎక్కువగా తీసుకుంటే.. జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా అసౌకర్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పరిమితంగా మాత్రమే గర్భిణీలు మినుములు తినడం మంచిది.

మినుములు ఎలా తింటే మంచిది?

1.రోజుకు పరిమితంగా మాత్రమే తీసుకోవాలి
2.నానబెట్టి వండితే జీర్ణక్రియకు మంచిది.
3. ఎక్కువ నూనెతో మినుములతో వంటకాలు చేయకూడదు.
4. ఇతర పప్పులతో కలిపి తింటే మాత్రం సమతుల ఆహారం అవుతుంది.

Also Read: బలమైన ఆహారమే.. కానీ మీ కిడ్నీలకు శాపంగా మారే అవకాశం! మినప్పప్పు వెనక ఉన్న చేదు నిజం

ఎవరెవరు మినుములు తగ్గించాలి?
1.అలర్జీ ఉన్నవారు
2.కిడ్నీ సమస్యలు ఉన్నవారు
3.తరచుగా గ్యాస్ సమస్య ఉన్నవారు

మినుములు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. కానీ అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు కలిగిస్తాయి. సరైన మోతాదులో.. సరైన పద్ధతిలో తీసుకుంటేనే.. పూర్తి ప్రయోజనం పొందొచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మినుములు తీసుకోవడం మంచిది.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×