E-Paper
Advertisement

High Blood Pressure: బీపీ.. 130/80 దాటితే లైట్ తీసుకోవద్దు, హెచ్చరిస్తున్న డాక్టర్లు !

High Blood Pressure: బీపీ.. 130/80 దాటితే లైట్ తీసుకోవద్దు, హెచ్చరిస్తున్న డాక్టర్లు !
Advertisement

High Blood Pressure: బీపీ అనగానే చాలామంది “అది అందరికీ ఉండేదే కదా” అని తేలికగా తీసుకుంటారు. కానీ.. తాజాగా వెలువడిన అంతర్జాతీయ ఆరోగ్య మార్గదర్శకాలు మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తున్నాయి. గతంలో రక్తపోటు కొంచెం ఎక్కువగా ఉన్నా పెద్దగా పట్టించుకోనవసరం లేదని భావించేవారు. అయితే.. ఇప్పుడు స్వల్ప రక్తపోటు కూడా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీపీని అదుపులో ఉంచుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది ప్రాణాంతకమవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు ?

Advertisement

బీపీ విషయంలో పాత లెక్కలు మారిపోయాయి. సాధారణంగా 120/80 mmHg ని బీపీగా పరిగణిస్తారు. అయితే.. గతంలో 140/90 దాటితేనే చికిత్స అవసరమని భావించేవారు. కానీ ఇప్పుడు, 130/80 స్థాయికి చేరినా దానిని ‘హై బ్లడ్ ప్రెజర్’ (స్టేజ్ 1) గానే చూడాలని డాక్టర్లు అంటున్నారు.

కొత్త మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు:

Advertisement

సైలెంట్ కిల్లర్: స్వల్పంగా పెరిగిన బీపీ ఎటువంటి లక్షణాలను చూపించదు. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. లోపల ధమనులు క్రమంగా దెబ్బతింటూ ఉంటాయి.

ప్రమాద తీవ్రత: స్వల్ప రక్తపోటు ఉన్నవారికి కూడా కిడ్నీ వ్యాధులు, కంటి చూపు మందగించడం, మెదడు రక్తనాళాలు చిట్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వయస్సుతో సంబంధం లేదు: ఇప్పుడు 30 ఏళ్ల లోపు యువతలో కూడా ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల బీపీ పెరుగుతోంది. దీనిని కేవలం వయస్సు రీత్యా వచ్చే మార్పుగా చూడకూడదు.

బీపీని ఎప్పుడు ప్రమాదకరంగా భావించాలి ?

నిపుణులు రక్తపోటును ఇప్పుడు మూడు వర్గాలుగా విభజిస్తున్నారు.

సాధారణం : 120/80 కంటే తక్కువ.

ఎలివేటెడ్ : సిస్టోలిక్ (పై రీడింగ్) 120-129 మధ్య ఉండి, డయాస్టోలిక్ 80 కంటే తక్కువ ఉండటం.

హైపర్ టెన్షన్: 130/80 లేదా అంతకంటే ఎక్కువ ఉండటం.

ఒకసారి రీడింగ్ ఎక్కువగా రాగానే కంగారు పడనవసరం లేదు, కానీ వరుసగా మూడు సార్లు రీడింగ్ ఎక్కువగా వస్తే మాత్రం వెంటనే డాక్టర్‌ని సంప్రదించి లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలి.

బీపీని అదుపు చేసే మార్గాలు:

మందులు వాడకముందే ప్రారంభంలో బీపీని నియంత్రించడానికి ఈ క్రింది మార్పులు తప్పనిసరి.

ఉప్పు తగ్గించడం: రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

DASH డైట్: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ,కొవ్వు తక్కువగా ఉన్న పాల పదార్థాలను తీసుకోవాలి. దీనినే ‘Dietary Approaches to Stop Hypertension’ (DASH) అంటారు.

శారీరక శ్రమ: రోజుకు కనీసం 30 నిమిషాల వేగవంతమైన నడక లేదా వ్యాయామం గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Also Read: ఆహారం,వ్యాయామం కంటే నిద్రే ముఖ్యం.. షాకింగ్ నిజాలు వెల్లడించిన కొత్త అధ్యయనం!

బరువు నియంత్రణ: అధిక బరువు బీపీకి ప్రధాన శత్రువు. బాడీ మాస్ ఇండెక్స్ అదుపులో ఉంచుకోవాలి.

ఒత్తిడి నిర్వహణ: యోగా, ధ్యానం , సరిపడా నిద్ర (కనీసం 7 గంటలు) బీపీని అద్భుతంగా తగ్గిస్తాయి.

బీపీ విషయంలో “నాకు బానే ఉంది కదా” అనే భ్రమలో ఉండటం ప్రమాదకరం. స్వల్ప మార్పులను కూడా గుర్తించి, ప్రాథమిక దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే మేజర్ సర్జరీలు, గుండె జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అత్యవసరం.

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×