E-Paper
Advertisement

Own farts Smell: ఇది ఛీ అనిపించినా కూడా నిజమే, మీ వాసన మీరు పీలిస్తే మతిమరుపే రాదట

Own farts Smell: ఇది ఛీ అనిపించినా కూడా నిజమే, మీ వాసన మీరు పీలిస్తే మతిమరుపే రాదట
Advertisement

అల్జీమర్‌ అంటే చాలా మందిని భయపెట్టే మెదడు వ్యాధి. దీనికి ఇప్పటివరకు పక్కా మందు లేకపోయినా, కొత్త కొత్త పరిశోధనలు మాత్రం ఆశ చూపిస్తున్నాయి. తాజాగా ఒక వింతైన అధ్యయనం వెలుగుచూసింది. ఇందులో మనం అసహ్యంగా భావించే ‘ఫార్ట్‌’ అంటే అపానవాయువు వాసనలో ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ (H₂S) అనే వాయువు మెదడుకు మంచి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాసనకు కారణం ఇదే
మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే ఈ H₂S గ్యాస్‌దే ఫార్ట్‌కు వచ్చే ఆ వాసనకు కారణం. కానీ విచిత్రం ఏమిటంటే, ఈ చిన్న పరిమాణంలో ఉండే వాయువు మెదడులో టౌ అనే ప్రొటీన్ అనే సమస్యను తగ్గించడంలో సహాయపడవచ్చని పరిశోధకులు గుర్తించారు. టౌ ప్రోటీన్‌ తప్పుగా పనిచేసినప్పుడు అల్జీమర్‌ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతుంటారు.

Advertisement

జాన్స్ హోప్కిన్స్‌ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాలు దీనికి బలం చేకూర్చాయి. అల్జీమర్‌ లక్షణాలు ఉన్న ఎలుకలకు ప్రత్యేకంగా రూపొందించిన స్లో రిలీజ్‌ H₂S వాయువును వారికి ఇవ్వగా ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. వాటి జ్ఞాపకశక్తి, కదలికలు దాదాపు 50 శాతం వరకూ మెరుగయ్యాయి. అంటే ఈ వాయువు మెదడును రక్షించే పనిని చేస్తుందనే అభిప్రాయం బలపడింది.

అల్జీమర్స్ వస్తుంది
అయితే ఫార్ట్‌ వాసన పీలిస్తే అల్జీమర్‌ రాదు అనేది నిజం కాదు. ఫార్ట్‌లో ఉండే H₂S చాలా చిన్న మొత్తంలో మాత్రమే ఉంటుంది. దాంతో మెదడుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రయోగాల్లో ఇచ్చే H₂S మాత్రం ఖచ్చితమైన మోతాదు, ప్రత్యేక విధానంతో తయారు చేస్తారు. అది ఫార్ట్‌లో వచ్చే వాసనతో ఏ మాత్రం పోల్చలేము. అంతేకాదు, H₂S ఎక్కువ మోతాదులో శ్వాసిస్తే ఆరోగ్యానికి హానికరం కూడా.

Advertisement

ఈ పరిశోధన ప్రధానంగా H₂S మెదడులో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి జరిగింది. ఈ వాయువు మెదడు కణాల ఆరోగ్యానికి అవసరమైన సల్ప్‌హైడ్రేషన్‌ అనే ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ సరిగ్గా లేకపోతే మెదడు కణాలు త్వరగా దెబ్బతింటాయి. H₂S ఆ లోటును పూడ్చే అవకాశం ఉందనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న స్టడీ మాత్రమే. ఇప్పటి వరకు ఎలుకలపై మాత్రమే మంచి ఫలితాలు కనిపించాయి. మనుషులపై ఇదే రీతిగా పనిచేస్తుందా? అని తెలుసుకోవడానికి దానికి సమయం, లోతైన పరిశోధన జరగాలి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తయారు చేసే ప్రత్యేక H₂S సమ్మేళనాల వల్ల ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్తులో ఇది అల్జీమర్‌ చికిత్సకు కొత్త మార్గం చూపుతుందా లేదా అనేది మరిన్ని పరిశోధనలు మాత్రమే చెబుతాయి.

అల్జీమర్‌ ప్రమాదాన్ని తగ్గించడానికి మెదడు కోసం ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజూ పాలకూర, మునగ ఆకులు వంటి ఆకుకూరలు తింటే మెదడు బలంగా ఉంటుంది. సాల్మన్, సార్డిన్స్‌ వంటి చేపల్లో ఉండే ఒమెగా-3 మెదడు కణాలను రక్షిస్తుంది. బాదం, వాల్‌నట్స్‌, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్‌ కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జామ, ద్రాక్ష, ఆపిల్‌ వంటి పండ్లు యాంటీ ఆక్సిడెంట్లతో మెదడును చురుకుగా ఉంచుతాయి. బ్రౌన్‌ రైస్, ఓట్స్‌, జొన్నలు వంటి ధాన్యాలు రక్త ప్రసరణకు సహాయపడతాయి. పసుపు, ఆలివ్‌ ఆయిల్‌, గ్రీన్‌ టీ కూడా మెదడుకు మంచి సపోర్ట్ ఇస్తాయి. జంక్ ఫుడ్‌, ఎక్కువ చక్కెర, వేపుడు పదార్థాలు మాత్రం తగ్గించడం మంచిది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×