E-Paper
Advertisement

Dark Shower: చీకటి స్నానం.. రాత్రివేళ తలస్నానం అంత మంచిదా? ఇంతకీ ప్రయోజనాలు ఏంటి?

Dark Shower: చీకటి స్నానం.. రాత్రివేళ తలస్నానం అంత మంచిదా? ఇంతకీ ప్రయోజనాలు ఏంటి?
Advertisement

Dark Shower: ఉదయాన్నే స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని కొందరు, రాత్రి స్నానం చేస్తే రోజంతా అంటిన మురికి వదిలి హాయిగా నిద్ర పడుతుందని మరికొందరు వాదిస్తుంటారు. ఈ చర్చలు పక్కన పెడితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, “డార్క్ షవర్స్” (Dark Showers)లేదా “చీకటి స్నానం” అనే పద్ధతి ట్రెండ్ అవుతోంది. ఇది వినడానికి వింతగా అనిపించినా.. దీని వెనక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అసలు ‘డార్క్ షవర్’ అంటే ఏంటి ?

సాధారణంగా మనం స్నానం చేయడానికి గదిలోకి వెళ్ళగానే బ్రైట్‌గా ఉండే లైట్లు ఆన్ చేస్తాం. కానీ డార్క్ షవర్ పద్ధతిలో.. లైట్లను పూర్తిగా ఆర్పేసి లేదా చాలా తక్కువ వెలుతురులో స్నానం చేస్తారు. ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్క్రీన్ల వెలుతురులో గడిపే యువతకు.. ఈ గాఢమైన చీకటిలో తలస్నానం చేయడం అనేది ఒక అద్భుతమైన “హీలింగ్” అనుభూతిని ఇస్తోంది.

Advertisement

నిద్రపై ప్రభావం:

మనం నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మెగ్నీషియం లేదా మెలటోనిన్ వంటి సప్లిమెంట్లను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాం. అయితే.. డార్క్ షవర్ ద్వారా సహజంగానే నిద్రను పొందవచ్చని లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ వివరించారు. దీని వెనక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

1.శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: మనం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసినప్పుడు.. శరీరం లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. మన మెదడుకు “ఇక నిద్రపోయే సమయం దగ్గరపడింది” అన సంకేతం పంపడానికి ఈ ఉష్ణోగ్రత తగ్గుదల ఒక ముఖ్యమైన సూచిక. దీని వల్ల మనం త్వరగా నిద్రలోకి జారుకుంటాం.

2. మెలటోనిన్ విడుదల: మన శరీరంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్ ‘మెలటోనిన్’. మనం ప్రకాశవంతమైన లైట్ల వెలుతురులో ఉన్నప్పుడు ఈ హార్మోన్ విడుదల ఆగిపోతుంది. చీకటిలో లేదా తక్కువ వెలుతురులో స్నానం చేయడం వల్ల శరీరం సహజంగానే మెలటోనిన్‌ను విడుదల చేస్తుంది. ఇది సప్లిమెంట్ల అవసరం లేకుండానే గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.

మానసిక ప్రశాంతత :

చీకటి స్నానం అనేది కేవలం శారీరక శుభ్రత మాత్రమే కాదు.. అది ఒక రకమైన ‘మైండ్‌ఫుల్ నెస్’. లైట్లు ఆర్పేసినప్పుడు మన కళ్ళకు విశ్రాంతి దొరుకుతుంది. దృష్టి మొత్తం నీటి స్పర్శ, శబ్దం మీదకు మళ్లుతుంది. ఇది మెదడును ఆలోచనల నుంచి మళ్లించి, ఒక స్పా ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లుగా లేదా ధ్యానం చేసినట్లుగా ప్రశాంతతను అందిస్తుంది. రోజంతా ఉండే ఒత్తిడిని, ఆందోళనను కూడా ఇది దూరం చేస్తుంది.

పురాతన సంప్రదాయం:

ఇది కేవలం ఒక ఆధునిక ట్రెండ్ మాత్రమే కాదు. ఆయుర్వేదంలో 5,000 ఏళ్ల క్రితమే చెప్పబడిన “స్నాన” (Snāna) అనే పద్ధతికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి నిమిషాన్ని పనిలో గడిపే నేటి కాలంలో.. ఇలా మైండ్‌ఫుల్‌గా స్నానం చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఇది తీవ్రమైన నిద్ర సమస్యలను పూర్తిగా నయం చేయకపోయినా.. పడుకునే ముందు మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి ఒక మంచి అలవాటుగా ఉపయోగ పడుతుంది.

Also Read: ఆత్మహత్యలు జరిగేవి.. డిప్రెషన్ వల్ల కాదట, అసలు కారణాలు ఇవేనట!

ఎలా ప్రారంభించాలి ?

మీరు కూడా డార్క్ షవర్స్ ప్రయత్నించాలనుకుంటే.. ఈ చిట్కాలు పాటించండి.

పూర్తి చీకటి వద్దు: మొదటిసారి డార్క్ షవర్స్ చేసేటప్పుడు పూర్తిగా చీకటిగా ఉంటే కళ్ళు తిరగడం లేదా జారి పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయట గదిలో లైట్ ఆన్ చేసి ఉంచడం లేదా బాత్‌రూమ్ డోర్ కింద నుంచి కొంచెం వెలుతురు వచ్చేలా చూసుకోవడం మంచిది.

సువాసనలు: ప్రశాంతత కోసం సువాసన ఇచ్చే క్యాండిల్స్ లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ వాడండి.

సంగీతం: తక్కువ శబ్దంతో మెలోడీ సాంగ్స్ వింటూ స్నానం చేస్తే అనుభూతి ఇంకా బాగుంటుంది.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×