E-Paper
Advertisement

Horror Thriller OTT : ఊళ్ళో తెగిపడే తలలు… వరుస హత్యలతో వణికిపోయే జనాలు… క్లైమాక్స్ వరకు దద్దరిల్లిపోయే ఇన్వెస్టిగేషన్

Horror Thriller OTT : ఊళ్ళో తెగిపడే తలలు… వరుస హత్యలతో వణికిపోయే జనాలు… క్లైమాక్స్ వరకు దద్దరిల్లిపోయే ఇన్వెస్టిగేషన్
Advertisement

Horror Thriller OTT : సాధారణ హార్రర్ సినిమాలను అందరూ చూస్తూనే ఉంటర్. ఎందుకంటే ఓటీటీలలో ఇలాంటి సినిమాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి.కానీ ఎప్పుడైనా ఇన్వెస్టిగేటివ్ హర్రర్ థ్రిల్లర్ సినిమాలను చూశారా ? ఒకవేళ చూడకపోతే ఈ మూవీ మీ కోసమే. భయంకరమైన సినిమాలను ఇష్టపడే వారికోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ సినిమాలో భయపెట్టేంతగా ఏముంది? అసలు సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘డిటెక్టివ్ కీన్: ది హెడ్‌లెస్ హారర్’ (Thám Tử Kiên: Kỳ Án Không Đầu). 2025లో విడుదలైన ఈ వియత్నామీస్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ కు దర్శకుడు విక్టర్ వూ (Victor Vu). క్వాక్ హుయ్ (డిటెక్టివ్ కీన్), డోన్ మిన్హ్ అన్హ్, ఫామ్ క్విన్హ్ అన్హ్, ట్రాన్ క్వాక్ అన్హ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. 2 గంటల 11 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2025 ఏప్రిల్ లో వియత్నాంలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. ఇక ఇలాంటి హర్రర్ మూవీ వస్తే మూవీ లవర్స్ ఎలా చూడకుండా ఉంటారు. అందుకేనేమో అక్కడ ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇండియాలో ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ కూడా ఉన్నాయి. ఒకవేళ భాష అడ్డు కాదు అనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు.

Advertisement

Read Also :  పబ్ లో మోడల్ హత్య… ఇంత ఓపెన్ గా మర్డర్ ఏంటి భయ్యా… ఈ క్రైమ్ డ్రామా క్లైమాక్స్ కేక

స్టోరీలోకి వెళ్తే…

కథ 19వ శతాబ్దం న్గుయెన్ డైనస్టీ కాలంలో జరుగుతుంది. వియత్నాంలోని ఒక మారుమూల గ్రామంలో మిస్టీరియస్ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాగే అక్కడున్న నది, దాని దగ్గర తెగిపడిన తల ఊర్లో వాళ్ళను భయాందోళనలకు గురి చేస్తుంది. దీంతో ఆ కేసు కోసం డిటెక్టివ్ కీన్ (క్వాక్ హుయ్)రంగంలోకి దిగుతాడు. ఒక హెడ్‌లెస్ బాడీని ఇన్వెస్టిగేట్ చేయడానికి గ్రామానికి వస్తాడు. విచారణలో భాగంగా మొదట అతనికి అది సాధారణ మర్డర్ కేసులా అనిపిస్తుంది. కానీ క్రమంగా అచ్చం ఒకే విధంగా మరిన్ని తలలేని బాడీస్ దొరుకుతాయి. అలా మొత్తం 8 మంది ఒకే రీతిలో చనిపోతారు. గ్రామస్తులు దీన్ని శాపంగా భావిస్తారు. మీదా (మీ యూయెన్) అనే మహిళ మర్డర్ అయిన తన భర్త కోసం వేటాడుతుందని ఊరు ఊరంతా నమ్ముతుంది.

Advertisement

కీన్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్నకొద్దీ సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ మొదలవుతాయి. ఇన్వెస్టిగేటర్ అయినప్పటికీ అతను కూడా దేవుళ్ళను నమ్ముతాడు. కానీ ఊర్లో దెయ్యాలు కాకుండా ఇంకేదో జరుగుతోందని పసిగడతాడు. గ్రామంలో దెయ్యాల బెడద ఎక్కువవుతుంది.చాలామంది దెయ్యాలను చూశామని చెప్పుకుంటారు. కానీ నిజానికి ఆ గ్రామ షమన్ ఒక ప్లాంట్ ఉపయోగించి ఈ హాలుసినేషన్స్ క్రియేట్ చేస్తూ, అందరినీ భయపెడుతున్నాడు అని తెలుస్తుంది. కీన్ టీమ్ షమన్‌ ను పట్టుకోవడంలో బిజీ అవుతుంది. మరోవైపు మూన్ అనే మహిళ తన ఫ్యామిలీ మెంబర్ మిస్ అయ్యారంటూ కీన్‌ను హెల్ప్ అడుగుతుంది. మరి మిస్ అయ్యింది ఎవరు? చివరకు దొరికారా ? అసలు తలలు లేకుండా హత్యలు చేసి, బాడీని అలా ఎవరు వదిలేస్తున్నారు ? ఈ హత్యాలతో షమన్ కు ఉన్న లింకు ఏంటి? నిజంగానే ఆ ఊర్లో దెయ్యాలు ఉన్నాయా? అనేది తెరపై చూసి తెలుసుకోవలసిన విషయాలు. స్పైన్ చిల్లింగ్ ట్విస్ట్స్ ఉన్నాయి డోంట్ మిస్.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×