E-Paper
Advertisement

భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!

భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!
Advertisement

NIUM Campus: భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్‌ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాంగణం కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాల భూమి కేటాయించింది.

20 ఎకరాలు..

2009లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ (JNNURM) కింద ఎంపికైనప్పటికీ ఎన్ఐయూఎంకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించని కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించింది. తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పనకు, కార్యాచరణ ఆధారిత పరిశోధన సంస్థగా ఎన్ఐయూఎం కీలకంగా పనిచేస్తుంది. 2028 జూన్ 2 నాటికి ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో..

Advertisement

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) భవనాల నిర్మాణాలు, పరిసర ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Also read: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Tags

Related News

చెడు చేసేవారికి ఎప్పటికీ విజయముండదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు

గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

Big Stories

Advertisement
×