E-Paper
Advertisement

Paneer Tikka Chapati: మైదా లేకుండా హెల్దీ పన్నీర్ రోల్స్.. ఈ సీక్రెట్ మసాలాలతో చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు!

Paneer Tikka Chapati: మైదా లేకుండా హెల్దీ పన్నీర్ రోల్స్.. ఈ సీక్రెట్ మసాలాలతో చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు!
Advertisement

Paneer Tikka Chapati: పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఆకలేస్తుందని చెబుతుంటారు. అలాంటి సమయంలో చిప్స్, చాక్లెట్స్ కాకుండా ఇంట్లోనే ఆరోగ్యకరంగా, రుచిగా ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ పన్నీర్ టిక్కా రోల్ మీకు బెస్ట్ ఆప్షన్. బయట దొరికే మైదా ఫ్రాంకీల కంటే ఇది ఎంతో ఆరోగ్యకరం. ఇప్పుడీ రోల్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

గోధుమపిండి – ఒక కప్పు
పెరుగు – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
పన్నీర్ – 200 గ్రాములు
పెరుగు – రుచికి కావాల్సినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – కొద్దిగా
గరం మసాలా – ఒక స్పూన్
చాట్ మసాలా – అర స్పూన్
ధనియాల పొడి – ఒక స్పూన్
జీలకర్ర పొడి – చిటికెడు
కారం – ఒక స్పూన్
బటర్ – చిన్న ముక్క
క్యాప్సికం – రెండు
ఉల్లిపాయ ముక్కలు – ఒకటి
టమాటా ముక్కలు – రెండు
మయోనైజ్ – కొద్దిగా
టమాటా కెచప్ – రుచికి పరిపడా

తయారీ విధానం:

Advertisement

ఒక బౌల్‌లో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె, పెరుగు వేసి సాఫ్ట్‌గా కలుపుకుని 15 నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత చపాతీల్లా ఒత్తుకుని రెండు వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా కార్న్ ఫ్లోర్ పట్టించాలి. మరో గిన్నెలో పెరుగుతో పాటు పైన చెప్పిన మసాలాలన్నీ వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కలను హై ఫ్లేమ్‌లో వేయించి పక్కకు తీయాలి. అదే పాన్‌లో వెన్న వేసి పన్నీర్ ముక్కలను వేయించి, సిద్ధం చేసుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. చివరగా టమాటా ముక్కలు, వేయించిన ముక్కలు కలిపేయాలి.

రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ కోసం కాల్చిన బొగ్గును చిన్న గిన్నెలో పెట్టి, ఆ గిన్నెను పన్నీర్ మిశ్రమం మధ్యలో ఉంచి కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ఆ చపాతీపై ఈ పన్నీర్ మిశ్రమాన్ని ఉంచి, పచ్చి ఉల్లిపాయలు, మయోనైజ్, కెచప్, నిమ్మరసం చల్లి రోల్ చేస్తే అద్భుతమైన పన్నీర్ టిక్కా రోల్ సిద్ధమైనట్లే.

Advertisement

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×