E-Paper
Advertisement

Jai Hanuman : హమ్మయ్య.. ప్రశాంత్ వర్మ గుడ్ న్యూస్ చెప్పేశాడోచ్.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..!

Jai Hanuman : హమ్మయ్య.. ప్రశాంత్ వర్మ గుడ్ న్యూస్ చెప్పేశాడోచ్.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..!
Advertisement

Jai Hanuman : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్.. చిన్న స్టోరీ లైన్ తో వచ్చిన ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ల లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా ఉండబోతుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో సినిమా ఇప్పట్లో లేదు అని ఫాన్స్ ఫిక్స్ అయ్యారు.. అందులో మొన్నటి వరకు ప్రశాంత్ వర్మ చుట్టు వివాదాలు చుట్టూముట్టాయి.. అయితే జై హనుమాన్ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు తాజాగా చెక్ పెడుతూ ఓ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని ప్రకటించారు. మరి ఎప్పటికి నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతుందో అన్నది ఒక్కసారి తెలుసుకుందాం..

‘జై హనుమాన్’ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య సీక్వెల్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.. ప్రస్తుతం సీక్వెల్ గా రాబోతున్న సినిమాల ట్రెండ్ నడుస్తుంది. హిట్ సినిమాల సీక్వెల్స్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాబ్లాక్ బాస్టర్ సీక్వెల్ జై హనుమాన్ ప్రస్తుతం సెట్స్ మీదకి వెళ్ళిబోతుంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా గ్రాండ్ లాంచ్ వేడుకకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న చారిత్రక నగరమైన హంపిలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ అట్టహాసంగా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.. దీని గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది..

Advertisement

Also Read: రాజేష్ ఇంటికి వెళ్లిన బాలు, మీనా.. బాలుకు క్లాస్ పీకిన మీనా.. రోహిణిని టార్గెట్ చేసిన దినేష్..

రెగ్యులర్ షూట్ అప్పుడే స్టార్ట్..?

దర్శకుడు ప్రశాంత్ వర్మ గత ఏడాది కాలంగా స్క్రిప్ట్‌పై కసరత్తు చేసి, ఈ పౌరాణిక గాథను వెండితెరపై ప్రేక్షకులును మెప్పించేందుకు సిద్ధమాయ్యాడు. ఇప్పటికే హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ట్ రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నెల 22 న కొబ్బరికాయ కొట్టి ప్రారంభించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కానుంది. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నట్లు తెలుస్తుంది. మొదటి పార్ట్ కంటే ఈ సినిమాలో విజువల్స్ ఎక్కువగా ఉంటాయని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండేలా మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×