Pomegranate Juice: దానిమ్మ జ్యూస్ రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించే “మాయా ద్రవం” అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గుండె ఆరోగ్యానికి దానిమ్మ మేలు చేస్తుందనేది నిజమే అయినప్పటికీ.. ఇది ఇప్పటికే ఉన్న తీవ్రమైన అడ్డంకులను పూర్తిగా కరిగించేస్తుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు తక్కువే. దానిమ్మ రసం గుండెపై చూపే ప్రభావం, వాస్తవాలు , డాక్టర్లు సూచించే జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం.
దానిమ్మ జ్యూస్: గుండె ఆరోగ్యానికి ఒక వరమా?
గుండె ఆరోగ్యం విషయంలో దానిమ్మ జ్యూస్ చాలా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఇది తగ్గిస్తుందని చాలా మంది చెబుతారు. అయితే.. సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.
1. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు:
దానిమ్మలో పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్స్ పునికాలగిన్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల లోపలి పొరను దెబ్బతినకుండా కాపాడతాయి. గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే కూడా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
2. చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధించడం:
రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందినప్పుడు మాత్రమే ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. దానిమ్మ జ్యూస్ ఈ ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదింపజేయడం ద్వారా కొత్త అడ్డంకులు ఏర్పడకుండా నిరోధించగలదు.
3. రక్తపోటు నియంత్రణ:
అధిక రక్తపోటు ధమనుల గోడలపై ఒత్తిడిని పెంచి అడ్డంకులకు దారితీస్తుంది. క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తపోటు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని కొన్ని క్లినికల్ ట్రయల్స్ సూచించాయి.
అడ్డంకులను పూర్తిగా తొలగిస్తుందా ?
కొన్ని అధ్యయనాలలో.. ఏడాది పాటు దానిమ్మ రసం తాగిన వారిలో ధమనుల గోడల మందం స్వల్పంగా తగ్గినట్లు గుర్తించారు. అయితే..
ది ఇప్పటికే 70-90% అడ్డంకులు ఉన్నవారికి శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.
కేవలం జ్యూస్ తాగడం వల్ల బ్లాక్స్ కరిగిపోతాయని భావించి మందులు మానేయడం ప్రమాదకరం.
గుండె జబ్బులు ఉన్నవారు దీనిని ఒక సప్లిమెంట్‌గా మాత్రమే చూడాలి కానీ.. ప్రధాన చికిత్సగా కాదు.
Also Read: పిల్లలు త్వరగా ఎత్తు పెరగాలా ? అయితే ఇలా యోగాసనాలు చేయించండి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
చక్కెర స్థాయిలు: మార్కెట్లో దొరికే ప్యాక్డ్ జ్యూస్‌లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు హానికరం. ఇంట్లోనే తయారు చేసుకున్న తాజా జ్యూస్ తాగడం మంచిది.
మందులతో పరస్పర చర్య: మీరు హైబీపీ లేదా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడుతుంటే.. దానిమ్మ జ్యూస్ తాగే ముందు డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది కొన్ని మందుల పనితీరును ప్రభావితం చేస్తుంది.