CCTV Footage Bus Accident: నంద్యాల జిల్లాలో ట్రావెల్ బస్సు ప్రమాదంలో ఏం జరిగింది? టైర్లు పేలినట్టు పైకి చెబుతున్నా అందుకు విరుద్ధంగా జరిగిందా? సీసీటీవీ ఫుటేజ్‌లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? కంటైనర్ లారీ డీజిల్ ట్యాంక్ పేలడంతో మంటలు చెలరేగాయా? తొలుత బస్సు నుంచి మంటలు చెలరేగలేదా? అవుననే అంటున్నారు అధికారులు.
నంద్యాల ట్రావెల్ బస్సు ప్రమాదంలో కొత్త విషయాలు
కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు సిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఘటన జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తేలింది. బస్సు టైర్లు పగిలిన తర్వాత స్పీడ్‌ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్. ఆ వేగంతో నేరుగా డివైడర్ దాటిన బస్సు.. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా కొట్టింది. లారీ డీజిల్ ట్యాంక్‌ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో
వేగానికి రెండు వాహనాలు వేడెక్కడంతో మంటలు ఇటు బస్సు.. అటు లారీని చుట్టుముట్టాయి. తేరుకునేలోపాటు వాహనాలు డ్రైవర్లు మంటల్లో కాలిబూడిదయ్యారు. అటువైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఆగి, డ్రైవర్ కిందకు దిగి బస్సు అద్దాలను పగలగొట్టారు. అప్పుడు అందులోని ప్రయాణికులు విండోల ద్వారా బయటపడ్డారు.
మంత్రి ఎండీ ఫారూఖ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు వాహనాలు మంటల్లో చిక్కుకుని డ్రైవర్లు, క్లీనర్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం అదృష్టమన్నారు. గాయపడినవారిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. కంటైనర్‌లో ఎలక్ట్రిక్ బైకులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అంచనా వేస్తున్నారు.
దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ టీమ్‌లు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అటు ప్రమాదానికి గురైన ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
ALSO READ: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొన్న బస్సు.. స్పాట్‌లో 36 మంది
నంద్యాల బస్సు ప్రమాదం సీసీటీవీ దృశ్యాలు
టైర్ పేలడంతో అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టిన బస్సు
కంటైనర్ డీజిల్ ట్యాంక్ పేలడంతో చెలరేగిన మంటలు https://t.co/dVtcoBnnAl pic.twitter.com/U7BPpsMqcV
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2026