E-Paper
Advertisement

Stranger Things Season 5 Review : “స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 1” రివ్యూ

Stranger Things Season 5 Review : “స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 1” రివ్యూ
Advertisement

రివ్యూ : స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1
షోరన్నర్స్ : ది డఫర్ బ్రదర్స్ (మ్యాట్ డఫర్, రాస్ డఫర్)
తారాగణం: వినోనా రైడర్, డేవిడ్ హార్బర్, మిల్లీ బాబీ బ్రౌన్, ఫిన్ వోల్ఫార్డ్, గాటెన్ మటరాజో ఇతరులు
ఎపిసోడ్‌లు : 4
విడుదల తేదీ : నవంబర్ 27
స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్

Stranger Things Season 5 Review : అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ డ్రామా ఐదవ, చివరి సీజన్ “స్ట్రేంజర్ థింగ్స్ 5” నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైంది. నాల్గవ సీజన్ రిలీజైన మూడు సంవత్సరాల తరువాత సీజన్ 5ను తెరపైకి తీసుకొచ్చారు. సీజన్ 5లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి, వాటిలో నాలుగు ప్రస్తుతం వాల్యూమ్ 1గా విడుదలయ్యాయి. ఈ నాలుగు ఎపిసోడ్‌లు గంటకు పైగా రన్‌టైమ్ కలిగి ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హారర్, అడ్వెంచర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్స్‌ మిక్స్ అయ్యి ఉండే ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ 

Advertisement

కథ సీజన్ 4 ఎండింగ్ తర్వాత 1.5 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. హాకిన్స్ టౌన్ వెక్నా చేసిన దాడి తర్వాత మిలిటరీ కంట్రోల్‌లో ఉంది. రెసిడెంట్స్ బయటకు వెళ్ళడానికి వీల్లేకుండా కఠినంగా ఉంటుంది సైనికుల కాపలా. ఎలెవెన్ (మిల్లీ బాబీ బ్రౌన్), హాపర్ (డేవిడ్ హార్బర్) అప్‌సైడ్ డౌన్‌లో వెక్నాను వెతుకుతున్నారు. హాకిన్స్ గ్రూప్ (మైక్, విల్, లూకాస్, డస్టిన్, రాబిన్, స్టీవ్, నాన్సీ, జానతన్) మిలిటరీ కంట్రోల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎలెవెన్ తన పవర్స్‌ను మరింత స్ట్రాంగ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తుంది. విల్ (నోహ్ ష్నాప్) వెక్నాతో మళ్లీ కనెక్ట్ అవుతాడు. వెక్నా హాకిన్స్‌లో మరిన్ని పోర్టల్స్ ఓపెన్ చేస్తాడు. దీంతో అప్‌సైడ్ డౌన్ రియల్ వరల్డ్‌తో మిక్స్ అవుతుంది. ఈ డేంజరస్ సిట్యుయేషన్ లో ఒక గ్రూప్ వెక్నాను వెతకడానికి వెళతారు. మరి ఇంతకీ వెక్నాను కనిపెట్టగలిగారా ? చివరికి వీళ్ళ ప్లాన్ ఏమైంది ? అన్నది తెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ 

సీజన్ 5 ను మునుపటి సీజన్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే స్నేహితుల టీంలుగా విడిపోయి, పోరాడతారు. ఈసారి త్రోబ్యాక్ లొకేషన్ బర్నౌట్ రాబిన్ (మాయా హాక్), స్టీవ్ (జో కీరీ) నడుపుతున్న రేడియో స్టేషన్ లో తమ దేశస్థులకు కోడెడ్ సందేశాలను పంపడానికి ఎయిర్‌వేవ్‌లను ఉపయోగిస్తారు. నాలుగు ఎపిసోడ్‌ల షోలో రెండవ ఎపిసోడ్‌ నుంచే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా వెక్నా జీవి నాన్సీ సోదరిని అపహరించి, ఆమె తల్లిని తీవ్రంగా గాయపరుస్తుంది. డఫర్ బ్రదర్స్ అద్భుతమైన VFX, BGM, సౌండ్ డిజైన్, అద్భుతమైన క్రియేచర్ డిజైన్ తో OTT ప్లాట్‌ఫామ్‌లపై సినిమాటిక్ అనుభవంతో పాటు ఆడియన్స్ కు సూపర్ ఫాంటసీ, అతీంద్రియ ప్రపంచాన్ని పరిచయం చేశారు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చివరి 20-25 నిమిషాలు అంటే క్లైమాక్స్ యాక్షన్, అద్భుతమైన VFX, హర్రర్, థ్రిల్‌తో నిండి అద్భుతంగా ఉంది.

Advertisement

నటీనటుల నటన ఎప్పటిలాగే సూపర్. ఎలెవెన్ పాత్ర అయిన మిల్లీ బాబీ బ్రౌన్ అద్భుతంగా నటించింది. విల్ పాత్రధారి నోహ్ ష్నాప్ తన గుర్తింపును, మైక్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచడం ఈ సీజన్‌లో మనసుకు హత్తుకునే హైలెట్ సీన్స్ లో ఒకటి. విల్ – రాబిన్ కొత్త స్నేహం కూడా హృదయాన్ని కదిలిస్తుంది. జో కీరీ – మైకా హాక్‌ల కెమిస్ట్రీ, రేడియో స్టేషన్‌లో వారి సంబంధం తేలికపాటి కామెడీతో ఆహ్లాదపరుస్తుంది.

అయితే నిజానికి స్ట్రేంజర్ థింగ్స్ అనేది అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న సీజన్. కాబట్టి చివరి సీజన్‌ లో వాల్యూమ్ 1లో అన్నీ సమాధానాలు లేకపోవడం కొంతమంది వీక్షకులకు కొంచెం నిరాశ కలిగించవచ్చు. మరో ప్రధాన లోపం ఏమిటంటే పాత్రలు అకస్మాత్తుగా పెద్ద వయస్సుకు చేరుకోవడం. భావోద్వేగాల విషయానికి వస్తే సిరీస్ కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. 18 నెలలకు పైగా గడిచినప్పటికీ లూకాస్ ఇప్పటికీ కోమాలో ఉన్న మాక్స్ కోసం ఏడుస్తున్నాడు. డస్టిన్ ఎడ్డీ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. విల్ ఇప్పటికీ తన బాల్య బౌల్ కట్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఎవరో ఫ్రీజ్ బటన్‌ను నొక్కి ఈ పిల్లలను ఆ స్థితిలో వదిలి వేసినట్లు అన్పిస్తుంది. అయినప్పటికీ కథతో కనెక్ట్ అవుతాము. మైక్ రాక్షసులు నిండిన నగరంలో నివశిస్తూనే, తన చెల్లెలు హోలీకి “రాక్షసులు నిజంగా ఉండరు” అని చెప్పడం విడ్డూరంగా అన్పిస్తుంది. కాగా మిగతా నాలుగు కొత్త ఎపిసోడ్‌లలో మూడు క్రిస్మస్ రోజున, చివరి ఎపిసోడ్ నూతన సంవత్సర రోజున విడుదలవుతుంది.

ప్లస్ పాయింట్స్ 

VFX, CGI ఎఫెక్ట్స్
యాక్షన్ సీన్స్
నటీనటుల నటన
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

మొదటి ఎపిసోడ్
అక్కడక్కడా సాగదీసిన సన్నివేశాలు

మొత్తానికి 

‘ స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 1’ ఈ సిరీస్ అభిమానులకు మేకర్స్ నుండి వచ్చిన అద్భుతమైన బహుమతి. ఓటీటీ కాదు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డోంట్ మిస్.

రేటింగ్ : 2.75/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×