E-Paper
Advertisement

Baby Diaper: పిల్లల్ని మురికి డైపర్లతోనే ఉంచేస్తున్నారా.. దీర్ఘకాలిక వ్యాధుల్ని ఎదుర్కోవాల్సిందే అంటున్న నిపుణులు!

Baby Diaper: పిల్లల్ని మురికి డైపర్లతోనే ఉంచేస్తున్నారా.. దీర్ఘకాలిక వ్యాధుల్ని ఎదుర్కోవాల్సిందే అంటున్న నిపుణులు!
Advertisement

Baby Diaper: నేటి ఆధునిక యుగంలో పిల్లలకు డైపర్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్లినా చిన్నారులకు అదేపనిగా డైపర్లు తొడగటం వల్ల ఆ  ప్రాంతంలో దద్దుర్లు వస్తున్నాయి.  అందుకే.. డైపర్లు ఎలా వాడాలి? రోజుకు ఎన్నిసార్లు మార్చాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలపై తల్లులకు పూర్తి అవగాహన అవసరం అంటున్నారు నిపుణులు. డైపర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు డైపర్లు తొడక్కపోవడమే ఉత్తమం. తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం ఎప్పటికప్పుడు డైపర్లను మారుస్తూ ఉండటం, ఆ ప్రదేశంలో గాలి తగిలేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అసవరం.

డైపర్లను ఎందుకు మార్చాలి?

గంటల తరబడి పిల్లలకు డైపర్లను మార్చకుండా అలానే వదిలేస్తే.. ఆస్తమా, డయాబెటిస్, ఎడిహెచ్డి వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేచర్ మైక్రో బయాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. శిశువు గట్ 10వేల వైరల్ జాతుల బారిన పడుతుందని తేల్చింది. ఇది సగటు చిన్నారుల్లో కనిపించే బ్యాక్టీరియా జాతుల సంఖ్య కంటే 10 రెట్లు ఎక్కువ. మలంలోని బ్యాక్టీరియా పేగుకు సులభంగా చేరుతుంది. ఇది పిల్లల్లో ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాండిడా వంటి శిలీంధ్రాలు తేమగా ఉన్న చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. వీటివల్ల వచ్చే దద్దుర్లకు మెడికేటెడ్ (యాంటీ ఫంగల్) క్రీములు వాడాల్సి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మురికి డైపర్లను పిల్లలకు అలాగే ఉంచడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలంలో ఉండే బ్యాక్టీరియా డైపర్ల నుంచి మూత్ర మార్గంలోకి వెళ్లి యూటీఐలకు కారణమవుతుంది. అయితే, ఈ యూటీఐల ప్రమాదం ఎక్కువగా అమ్మాయిలకే ఉంటుంది. ఎందుకంటే.. అమ్మాయిల మూత్రాశయం అబ్బాయిలతో పోలిస్తే చిన్నవి కాబట్టి.

Advertisement

Read Also: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

డైపర్ల ఎంపిక ముఖ్యం:

* వీలైనంత వరకు మంచి డైపర్లను ఎంచుకోవాలి. కాట‌న్ డైప‌ర్లయితే వాటిని ఎక్కువ రోజులు ఉప‌యోగించ‌వ‌చ్చు. ఉతికి ఆరేసి మ‌ళ్లీ వాడుకోవ‌చ్చు.
* డిస్పోసబుల్​ డైపర్స్ అయితే.. వాడిన తర్వాత ఎప్ప‌టిక‌ప్పుడు ప‌డేయొచ్చు. కానీ ఇవి కొంచెం ఖ‌ర్చుతో కూడుకున్న‌వి.
* ఒకవేళ కాట‌న్ డైప‌ర్లు వాడితే.. వాటిని ఉతికిన త‌ర్వాత‌ అందులోని డిట‌ర్జెంట్ అంతా పోయేవ‌ర‌కు వేడి నీటిలో శుభ్రంగా క‌డిగి త‌ర్వాత వాడుకోవాలి.
* కాటన్ డైపర్లను కొన్న వెంట‌నే కాకుండా.. రెండు, మూడుసార్లు ఉతికిన త‌ర్వాతే ఉప‌యోగించ‌డం ఇంకా మంచిది.
* పిల్లలకు డిస్పోసబుల్​ డైప‌ర్స్ వాడాలనుకున్నప్పుడు వాటిని వాడే ముందు క్రీమ్ రాసి ఉపయోగించాలి.

నివారణ మార్గాలివే:

Advertisement

చిన్నారులకు డైప‌ర్ల‌ను ప్ర‌తి రెండు లేదా మూడు గంట‌ల‌కోసారి త‌ప్ప‌కుండా మార్చలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆ ప్రదేశంలో గాలి తగిలేలా చూసుకోవాలి. రోజూ కొంత సేపు డైపర్ లేకుండా పిల్ల‌ల్ని అలానే ఉంచాలి. ఒకవేళ రాషెస్ బాగా వ‌స్తే.. జింక్ ఆక్సైడ్, సిలికాన్ బేస్ రాష్ క్రీమ్స్‌ను వాడాలి. ఆ ప్రాంతంలో ఫంగ‌ల్ ఇన్​ఫెక్ష‌న్ల‌ు వస్తే కచ్చితంగా వైద్యుల్ని సంప్ర‌దించాలి. ఒకవేళ దద్దుర్లు ఎక్కువ‌గా ఉంటే.. త‌క్కువ మోతాదులో స్టిరాయిడ్స్ వాడాల్సి రావ‌చ్చు. అదికూడా వైద్యుల సూచనలు మేరకే. పిల్లల చర్మం ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

Read Also: ప్రతి తల్లికీ ఉండే సందేహం.. ఆ వయసు పిల్లలకు కొబ్బరినీళ్లు ఇవ్వడం కరెక్టేనా?

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×