E-Paper
Advertisement

GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. బీజేపీ, మజ్లిస్ మధ్య తోపులాట

GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. బీజేపీ, మజ్లిస్ మధ్య తోపులాట
Advertisement

GHMC Council Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ, మజ్లిస్ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. వందేమాతరం గీతాలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదని బీజేపీ సభ్యులు తప్పుబట్టారు. వందేమాతరం పాడితేనే దేశంలో ఉండాలని బీజేపీ కార్పొరేటర్లు అనడంతో కాసేపు బీజేపీ, మజ్లిస్ మధ్య తోపులాట చోటుచేసుకుంది.

రసాభాసగా కౌన్సిల్ సమావేశం

మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ, మజ్లిస్ సభ్యులు కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్‌తో బయటకు పంపుతానని అనడంతో కాసేటికి గొడవ సర్దుమణిగింది. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతాలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మేయర్ ను కోరారు. అలాగే అందెశ్రీకి నివాళిగా జయజయహే తెలంగాణ కూడా పాడుదాం అని కోరారు. దీనిని ఎంఐఎం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించింది.

Advertisement

సభ్యుల మధ్య తోపులాట

కౌన్సిల్ లో వందేమాతరం గీతాలాపన జరిగింది. ఎంఐఎం కార్పొరేటర్ సోహెల్ వందేమాతరం గీతాలాపన సమయంలో నిలబడకుండా కూర్చొని నిరసన తెలిపారు. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో మబ్లిస్ కార్పొరేటర్లు కూర్చొనే ఉన్నారు. బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు పార్టీల సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. కౌన్సిల్‌లో రసాభాసతో మార్షల్స్ ఎంట్రీ ఇచ్చారు. మనమేమైనా రౌడీలమా? అంటూ మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: Constable Dance: ఏకాంత సేవ అంటూ మహిళతో కానిస్టేబుల్ అశ్లీల నృత్యాలు.. సస్పెండ్ చేసిన ఎస్పీ

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×