E-Paper
Advertisement

మాట్లాడే సమయంలో ఈ ట్రిక్స్ చేస్తే ఎదుటివారు మిమ్మల్నే చూస్తుండిపోతారు.. చూపుతిప్పుకోలేరు

మాట్లాడే సమయంలో ఈ ట్రిక్స్ చేస్తే ఎదుటివారు మిమ్మల్నే చూస్తుండిపోతారు.. చూపుతిప్పుకోలేరు
Advertisement

చాలామందికి ఒక సాధారణ సమస్య ఉంటుంది. తాము చెప్పే విషయాలను ఇతరులు సీరియస్‌గా తీసుకోవడం లేదని భావిస్తారు. ఏదైనా మీటింగ్స్, ఉద్యోగంలో లేదా కుటుంబంలో తమ మాటలకు ప్రాధాన్యం తగ్గిందని అనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న సైకాలజీ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ అలవాట్లు మీ సంభాషణలను మరింత ప్రభావవంతంగా మారుస్తాయి.

మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి పేరు ఉపయోగించాలి

ప్రతి వ్యక్తికి తన పేరు వినడం ఇష్టం. అందుకే మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి పేరును సహజంగా ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల వారు తమను మీరు గౌరవిస్తున్నారని భావిస్తారు. ఇది వారితో త్వరగా అనుబంధాన్ని పెంచుతుంది. అయితే పేరును పదే పదే ఉపయోగించకుండా సహజంగా మాట్లాడడం ముఖ్యం.

ముందుగా వినడం నేర్చుకుంటే మీ మాటలకు విలువ పెరుగుతుంది

Advertisement

చాలామంది తమ అభిప్రాయాలను వెంటనే చెప్పాలని ప్రయత్నిస్తారు. కానీ మంచి సంభాషణకు మొదటి మెట్టు వినడమే. అవతలి వ్యక్తి చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. మధ్యలో అడ్డుకోవద్దు. ఎవరైనా తమ మాటలను శ్రద్ధగా వింటే, వారు కూడా మీ మాటలను వినడానికి ఆసక్తి చూపుతారు. ఈ అలవాటు నమ్మకాన్ని పెంచుతుంది.

చిన్న రిక్వెస్ట్ చేస్తూ ప్రారంభించాలి

ఏదైనా పెద్ద విషయాన్ని ఒప్పించాలంటే ముందుగా చిన్న అభ్యర్థనతో ప్రారంభించాలి. సాధారణంగా ప్రజలు చిన్న విషయాలకు సులభంగా అంగీకరిస్తారు. ఒకసారి ఎదుటివ్యక్తి మీరు చెప్పే చిన్ని విషయాన్ని అంగీకరిస్తే చాలు.. తర్వాత, పెద్ద విషయాలను కూడా అంగీకరించే అవకాశం పెరుగుతుంది. సైకాలజీలో ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతిగా భావిస్తారు.

సానుకూల బాడీ లాంగ్వేజ్ మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది

Advertisement

మాటలతో పాటు శరీర భాష కూడా చాలా ముఖ్యమైనది. మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూసి మాట్లాడాలి. ముఖంపై చిరునవ్వు ఉండాలి. నమ్మకంగా కూర్చోవడం లేదా నిలబడడం అవసరం. బాడీ లాంగ్వేజ్ ద్వారా మీరు ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు. దీంతో ఇతరులు మీ మాటలను మరింత శ్రద్ధగా వింటారు.

ఇతరులను ప్రత్యేకంగా భావించేలా చేయాలి

ప్రతి వ్యక్తి తన కృషికి గుర్తింపు కోరుకుంటాడు. అందుకే నిజాయితీగా ప్రశంసించడం మంచి ఫలితాలను ఇస్తుంది. వారి విజయాలను లేదా మంచి పనులను గుర్తించి అభినందించాలి. అయితే కృత్రిమంగా లేదా అతిగా పొగడకూడదు. నిజమైన ప్రశంసలు నమ్మకాన్ని, సానుకూల భావనలను పెంచుతాయి.

ఈ అలవాట్లు మీ సంభాషణల్లో పెద్ద మార్పు తీసుకువస్తాయి

ఈ ఐదు సైకాలజీ చిట్కాలను పాటించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ప్రతిరోజూ ఒక అలవాటు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. క్రమంగా ఇవి మీ వ్యక్తిత్వంలో భాగమవుతాయి. దీంతో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని మరింత గౌరవభావంతో చూస్తారు.

Also Read: న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టినవారు కేవలం మాటలతో అందరినీ అకట్టుకుంటారు..

మంచి సంభాషణలు జీవితంలో కొత్త అవకాశాలను తెస్తాయి

సంబంధాలు, ఉద్యోగం, సామాజిక జీవితంలో విజయానికి మంచి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. చిన్న చిన్న మార్పులతోనే మీ ప్రభావాన్ని పెంచుకోవచ్చు. ఈ చిట్కాలను ఈరోజే అమలు చేయండి. కొద్ది రోజుల్లోనే ఇతరులు మీ మాటలను మరింత శ్రద్ధగా వినడం మీరు గమనిస్తారు.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×