Shoaib Akhtar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. మే 31వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Gujarat Titans vs Royal Challengers Bangalore) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది బెంగళూరు. దీంతో వరుసగా రెండవ సారి ఛాంపియన్ గా నిలిచింది. 2026 ఐపిఎల్ ఛాంపియన్ గా బెంగళూరు నిలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ( vaibhav Sooryavanshi) ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కు వెళ్తే బాగుండేదని వెల్లడించారు. రాజస్థాన్ ఫైనల్ కు వెళ్లి ఉంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల ప్యాంట్లు తడిచేయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరి.. అందరికీ నిరాశ మిగిల్చిందని విమర్శలు చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నారు. అతని ఊపు చూసి… ఫైనల్స్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఛాంపియన్ చేస్తాడని అనిపించిందని గుర్తు చేశారు. ఐపీఎల్ ప్రారంభంలో షేన్ వార్న్ కూడా ఇలాగే అద్భుతం చేసి రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించాలని వెల్లడించారు. అచ్చం అలాగే వైభవ్ కూడా కనిపించడానికి వ్యాఖ్యానించారు. కానీ దురదృష్టవశాత్తు క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందని ఎమోషనల్ అయ్యారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.
కానీ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ కాకుండా, రాజస్థాన్ రాయల్స్ వచ్చి ఉంటే, సీన్ వేరేలా ఉండేదన్నారు. కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల ప్యాంట్లు తడిచేయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లకు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించేవాడని… ఈ దెబ్బకు సెంచరీ నమోదు చేసుకొని చరిత్ర సృష్టించేవాడని తెలిపారు. అనవసరంగా గిల్ టీమ్ ఫైనల్ కు వచ్చి ఓడిపోయిందని సెటైర్లు పేల్చారు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరడం వల్ల 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆట చూడలేకపోయామని వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: IPL 2026 Finals RCB VS GT: గుజరాత్ వర్సెస్ RCB మధ్య ఫైన ల్స్..ముందే ఊహించిన అనన్య బిర్లా, పాత పోస్ట్ వైరల్ IPL 2026 Finals RCB VS GT