E-Paper
Advertisement

Telangana: మానవత్వం చాటుకున్న రేవంత్ సర్కార్.. గల్ఫ్ కార్మికుడి మృతదేహం తరలింపుకు రూ. 1.50 లక్షల సాయం

Telangana: మానవత్వం చాటుకున్న రేవంత్ సర్కార్.. గల్ఫ్ కార్మికుడి మృతదేహం తరలింపుకు రూ. 1.50 లక్షల సాయం
Advertisement

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఓ నిరుపేద గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేక.. అటు కంపెనీ యాజమాన్యం ఇటు ఇండియన్ ఎంబసీ చేతులెత్తేసిన తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో స్పందించి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని గంటల వ్యవధిలోనే మంజూరు చేసింది.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (40) నాలుగు నెలల క్రితం ఓమాన్‌లోని సలాలాకు క్లీనింగ్ పని నిమిత్తం వెళ్లారు. అయితే, అక్కడి కంపెనీ పరిస్థితులు నచ్చక బయటకు వచ్చిన ఆయన, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందారు. అనుమతి లేకుండా కంపెనీ వీడి బయటకు రావడంతో అక్కడి చట్టాల ప్రకారం ఆయనను అక్రమ నివాసిగా పరిగణించారు. దీనిని సాకుగా చూపుతూ మృతదేహం తరలింపు బాధ్యతను కంపెనీ నిరాకరించింది. అటు మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా నిధుల కొరత ఉందని పేర్కొంటూ, ఖర్చులు భరించకపోతే ఓమాన్‌లోనే అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలపడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Advertisement

ప్రభుత్వం తక్షణ స్పందన..

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మృతుడి భార్య చిన్న సావిత్రి తన కుమారుడితో కలిసి మంగళవారం  హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. నెల రోజులుగా భర్త మృతదేహం ఆసుపత్రి శవాగారంలోనే ఉండిపోయిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ముఖ్యమంత్రి కార్యాలయం అత్యంత వేగంగా స్పందించింది. కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి రూ. 1.50 లక్షల చెక్కును జారీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.

Advertisement

వ్యవస్థాగత లోపాలు..

మృతుడు అబ్బులు ప్రవాసీ భారతీయ బీమా యోజన (PBBY) కలిగి ఉన్నప్పటికీ, మృతదేహం తరలింపులో ఎంబసీ గానీ, విదేశీ వ్యవహారాల శాఖ గానీ చొరవ చూపకపోవడం గమనార్హం. మదద్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్పందించని పక్షంలో.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి పేద కుటుంబానికి అండగా నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ALSO READ: Jallikattu Bull Festival: జల్లికట్టు ఎందుకంత ఫేమస్? పోటీలో దిగాలంటే నాన్‌వెజ్ తినకూడదా? ఆసక్తికర విషయాలు ఇవిగో..

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×