E-Paper
Advertisement

Radish Leaves: ముల్లంగి ఆకులతో ఇన్ని లాభాలా.. తెలిస్తే షాక్ అవడం పక్కా

Radish Leaves: ముల్లంగి ఆకులతో ఇన్ని లాభాలా.. తెలిస్తే షాక్ అవడం పక్కా
Advertisement

Radish Leaves: ముల్లంగి మాత్రమే కాదు ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ముల్లంగిని ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. కానీ చాలా మంది దీని ఆకులను బయట పడేస్తుంటారు. కానీ ఇందులోని పోసకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ముల్లంగి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వారికి ముల్లంగి ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ముల్లంగి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ముల్లంగి ఆకులను తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముల్లంగి ఆకుల  వల్ల కలిగే ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ముల్లంగి ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ముల్లంగి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు , ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో మేలు జరుగుతుంది. తరుచుగా ముల్లంగి ఆకులను తినడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.

Advertisement

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ముల్లంగి ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రక్తహీనతను తొలగిస్తుంది: ముల్లంగి ఆకుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి మేలు చేస్తుంది. అంతే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. తరుచుగా ముల్లంగి ఆకులను వాడటం వల్ల రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది: యాంటీఆక్సిడెంట్లు ముల్లంగి ఆకులలో పుష్కంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బరువు తగ్గడంలో సహాయకారి: ముల్లంగి ఆకుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.  అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ముల్లంగి ఆకులను తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఎక్కువగా ఉంది.

Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. క్షణాల్లోనే పంటి నొప్పి మాయం

ముల్లంగి ఆకులను సలాడ్‌లో ఎలా తీసుకోవాలి ?
ముల్లంగి ఆకులను సలాడ్‌లో చేర్చుకుని తినవచ్చు.

కూరగాయలు: ముల్లంగి ఆకులను ఇతర కూరగాయలతో కలిపి వంటకాలు తయారు చేసుకోవచ్చు.

పరాటా: ముల్లంగి ఆకులను కోసి పిండిలో కలిపి పరాటా కూడా తయారు చేసుకోవచ్చు.

స్మూతీ: మీరు స్మూతీస్‌లో ముల్లంగి ఆకులను కూడా కలుపుకోవచ్చు.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

Big Stories

Advertisement
×