TikToker Dance dying Boyfriend| పాశ్చాత్య దేశాల్లో యువతులు తమకంటే రెండు మూడు రెట్లు వయసులో పెద్దవారితో ప్రేమించడం, డేటింగ్ చేయడం చాలా సహజం. వీరిలో చాలా మంది వారి ఆస్తులు చూసి లవ్ చేస్తుంటారనేది బహిరంగ రహస్యం. పైకి తమది నిజమైన ప్రేమ అని గొప్పలు చెప్పుకున్నా.. చివరకు తేలేది అదే. ఈ క్రమంలోనే ఒక 22 ఏళ్ల యువతి (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్) 85 ఏళ్ల ముసలి వ్యక్తిని ప్రేమించింది.
కెనెడాలోని టొరొంటోకి చెందిన టిక్ టాక్ సెలిబ్రిటీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బ్రాన్‌విన్ అరోరా అల్లరిగా, ఫన్నీగా వీడియో చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ఏడాది కాలంగా 85 ఏళ్ల వ్యక్తితో రిలేషన్ లో ఉంది. అప్పటి నుంచి ఆమె వీడియోలు తెగవైరల్ అవుతున్నాయి. చాలామంది ఆమెను తన తాత వయసు వ్యక్తిని ప్రేమించడం ఏంటి? అని ఎగతాళి చేసేవారు. అలాంటి వారందరికీ ఆమె ఫన్నీగా సమాధానాలు ఇచ్చేది. తమ మధ్య శారిరక బంధం లేదని.. కేవలం ఒకరికి మరొకరు అర్థం చేసుకొని సన్నిహితంగా ఉంటామని చెప్పేది.
ఈ నేపథ్యంలో తాజాగా బ్రాన్ విన్ చేసిన ఒక వీడియో చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఆమె తాజా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోకు ఒక్క రోజులోనే 480k వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో బ్రాన్ విన్ ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితిలో కనిపిస్తున్నాడు. ఆ సమయంలో బ్రాన్ విన్ అతని పక్కనే నిలబడి సంతోష పడుతూ డాన్సులు చేసింది. పైగా డాన్సు చేసే సమయంలో నాకు అతని వీలునామాలో దక్కింది. అతని ఆస్తి దక్కేసింది. ఇంకేముందు అతడి ప్లగ్ లాగ్గేద్దామా? (చంపేద్దామా) అంటూ నవ్వుతూ చిందులు వేసింది.
Also Read| Matrimony Fraud: 3 నెలల్లో 35 లక్షలు సంపాదించిన పెళ్లికూతరు.. ఏజెన్సీతో కలిసి మోసం చేయడమే పని
ఆ వీడియో చూసిన నెటిజెన్లందరూ బ్రాన్ విన్ ని, పాశ్చాత్య సంస్కృతిని తిట్టిపోస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోతుంటే అతని పక్కన నిలబడి సంతోషంగా డాన్స్ చేయడం.. పైగా ఆ వ్యక్తి తన ప్రియుడే కావడంతోపాటు ఆస్పత్రి లాంటి ప్రదేశంలో ఒక వ్యక్తి చనిపోతున్నందుకు చిందులు వేయం చాలా అసహ్యకరంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
ఆ వీడియోలో బ్రాన్ విన్ ఒక బ్లాక్ జీన్స్, టాన్ హాల్టర్ టాప్ ధరించి అందంగా నవ్వుతూ ఉంది. పక్కనే ఆమె ముసలి ప్రియుడు బలహీనంగా పేలవంగా ఆస్పత్రి బెడ్ పై చికిత్స తీసుకుంటూ కనిపిస్తున్నాడు. అతడి పక్కనే నిలబడి బ్రాన్ విన్ సంతోషంగా ఎగిరి గంతులేస్తూ.. నాకు అతని ఆస్తి దక్కేసింది. ఇంకేముంది అతని ప్లగ్ లాగేస్తాను అని పాడుతోంది.
ఈ వీడియో, టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా వైరల్ అవుతోంది. చాలా మంది ఆమెకు మనసు, మానవత్వం ఉందా? కనికరం లేకుండా అంత కృూరంగా ఎలా ప్రవర్తిస్తోంది? అని మండిపడుతున్నారు.
Western liberal society is so damn cooked, man. This is not a great thing to aspire to. pic.twitter.com/O9xbdwscgi
— Ian Miles Cheong (@stillgray) December 2, 2024