Telangana BJP: కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. ఇద్దరూ బీజేపీ నుంచే గెలిచినా.. ఉప్పునిప్పులా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడా ఇద్దరు ఒకే సమస్యపై జరుగుతున్న ప్రజాపోరాటానికి మద్దతు ఇస్తున్నారు. అయితే కలిసి పోరాడాల్సిన నేతలు వేర్వేరుగా కార్యాచరణకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అజెండా ఒకటే అయినా ఇద్దరు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించడం చూస్తూ.. వారి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతతమవ్వడం క్యాడర్‌లో కలకలం రేపుతోందంట. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హుజురాబాద్ మండలం సిర్సపల్లి లోని. 25 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల అనారోగ్యాలకు గురవుతామని, పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డ్ ప్రతిపాదిత ప్రాంత పరిసర గ్రామాలతో పాటు హుజురాబాద్ మునిసిపాలిటీ ప్రాంతంలోని వారంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా నిరవధికంగా ఆందోళనలు చేపడుతున్నారు.
వారి ఆందోళనకు మద్దతుగా, డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ కూడా తన వంతు బాసటగా నిలవాలని నిర్ణయించింది. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ లు ఆక్కడ పర్యటించారు. అయితే ఇప్పుడు వారిద్దరూ ఒకేరోజు వెర్వేరు సమయంలొ అక్కడ పర్యటించడంతో వీరిద్దరూ ఇంకా విభేధాలు పక్కన పెట్టలేదా అన్న చర్చ నడుస్తుంది. హుజురాబాద్ నుండి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఈటల రాజేందర్ గత శనివారం హుజురాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు ప్రకటించారు. డంప్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేయడం ప్రమాదకరమన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటు కి వ్యతిరేకంగా తన వంతు కృషి చేస్తానని మాట కూడా ఇచ్చారు.తరువాత ఇల్లందకుంట రామాలయంలో పూజలు నిర్వహించిన ఈటల హైదరాబాద్ కు పయనం అయ్యారు. ఈటల వెళ్ళాక కొద్దిసేపటికి. హుజురాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డంప్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలు లేని చోటకు తరలించాలని డిమాండ్ చేశారు.
Also Read: మణిపూర్‌లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇల్లందకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఇద్దరి పర్యటనలు దాదాపు 30 నిమిషాల నుండి గంట వ్యత్యాసంలోనే కొనసాగాయి. అయితే ఇద్దరు నాయకులు మాత్రం ఎవరికి వారే తమ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం. వారిద్దరూ వేర్వేరుగా నిరసన చేస్తున్న వారికిమద్దతు తెలిపి, తరువాత ఒకే దేవాలయం లో పూజలు చెయ్యడం ఇప్పుడు చర్చలకి దారితీస్తోంది. ఢిల్లీలో లోకసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ ఢిల్లీ నుండే హైదరాబాద్ చేరుకుని హుజురాబాద్ నియోజకవర్గంలో వేరువేరు సమయంలో పర్యటించడం మరొకసారి వీరిద్దరి మధ్య విభేధాలని ఎత్తి చూపాయి. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండిసంజయ్, మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది.. తన అనుచరులకి హుజురాబాద్ లో పార్టీ పదవులతో పాటుగా ప్రాతినిధ్యం ఇవ్వకుండా తన అనుచరులని తొక్కేస్తున్నారని ఈటల ఆ మధ్య బండిసంజయ్ ని ఉద్దేశించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
తనకి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ ఈటల అసహనంతో ఉన్నారు. అయితే పార్టీ జోక్యం చేసుకొవడంతో కొద్ది రోజులుగా మౌనం వహిస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్ లో నియోజకవర్గం ఇద్దరూ పర్యటించడం అది కొద్ది వ్యవధి తేడాతోనే కావడంతో వారిద్దరి మధ్య సఖ్యత కుదిరే పరిస్థితి లేదని.. మనస్పర్ధలు అలాగే కొనసాగుతున్నాయని మరోసారి బహిర్గతం అయింది. మరి మున్ముందు వారి కోల్డ్ వార్ ఎఫెక్ట్ ఎటు నుంచి ఎటు దారితీస్తుందో చూడాలి.
Storey By: Appa Rao Big Tv
Also Read: కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!