E-Paper
Advertisement

Reverse Diet: సెలబ్రిటీల్లా నాజూగ్గా కనిపించాలంటే.. ఈ రివర్స్ డైటింగ్ పని పట్టాల్సిందే!

Reverse Diet: సెలబ్రిటీల్లా నాజూగ్గా కనిపించాలంటే.. ఈ రివర్స్ డైటింగ్ పని పట్టాల్సిందే!
Advertisement

Reverse Diet: అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల డైట్‌ల‌ను పాటిస్తుంటారు. అయితే, ఒక్కో డైట్‌లో ఒక్కో రకంగా భిన్న ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీటో డైట్‌, ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్‌, మెడిట‌రేనియ‌న్ డైట్‌.. ఇలా అనేక రకాల డైట్‌లను చాలామంది పాటిస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం ‘రివ‌ర్స్ డైట్’ కాన్సెప్ట్ ఎక్కువ‌గా వినిపిస్తోంది. అస‌లు రివ‌ర్స్ డైట్ అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటి? దీనిని ఎలా పాటించాలి.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమిటీ రివర్స్ డైట్?

రివ‌ర్స్ డైట్ అంటే.. ఒక డైట్‌ను పాటించిన త‌ర్వాత మ‌రో డైట్‌ను పాటించ‌డం. అంటే.. చాలామంది ఒకే డైట్‌ను చాలా కాలం పాటు పాటిస్తుంటారు. కానీ రివ‌ర్స్ డైట్ అలా కాదు. ఒక డైట్‌ను కొన్ని రోజుల పాటు పాటిస్తారు. ఆ టైం ముగియ‌గానే మరో డైట్‌ను స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా అన్ని ర‌కాల డైట్‌ల‌ను కొన్ని రోజుల పాటు పాటిస్తూ వెంట వెంట‌నే ఇంకో డైట్‌ను పాటించ‌డం మొద‌లు పెడ‌తారు. దీనినే రివ‌ర్స్ డైటింగ్ అంటారు. అయితే, రివ‌ర్స్ డైట్‌లో ప్ర‌త్యేకంగా ఆహారాల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, అన్ని ర‌కాల డైట్‌ల‌ను వెంట వెంట‌నే కొన్ని రోజులపాటు పాటిస్తార‌న్న‌మాట‌. దీన్నే రివ‌ర్స్ డైట్ అంటారు.

 పాటించడం ఎలాగంటే:

Advertisement

రివర్స్ డైట్ కోసం.. మీ ఆహారంలో 100 నుంచి 200 కేలరీలు అదనంగా తీసుకోండి. అయితే, ఇది ఫాస్ట్ ఫుడ్ కాకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం అవ్వాలి. ఒక వారం తర్వాత.. మీ శరీరంలో కరిగే మార్పులను గమించండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే.. మరో వారం తర్వాత ఇంకో 100 కేలరీలు ఆహారం పెంచండి. ఇలానే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో మీరు బరువు పెరగుతున్నట్లు అనిపిస్తే వెంటనే 100 కేలరీలు తగ్గించండి. ఈ విధంగా మీరు ఫిట్‌గా ఉండటానికి, బరువును నియంత్రించడానికి ఎన్ని కేలరీలు అవసరమో మీకే అవగాహన ఏర్పడుతుంది.

Read Also: ఇంట్లోనే మినీ వ్యాయామశాల.. బాడీ ఫిట్‌నెస్‌పై దిగులేలా!

మెరుగైన ఫలితాలు పొందుతారు:

Advertisement

రివ‌ర్స్ డైటింగ్ చేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రివ‌ర్స్ డైట్‌పై కొంద‌రు సైంటిస్టులు గ‌తంలో అధ్య‌య‌నం కూడా చేప‌ట్టారు. దీని ప్ర‌కారం.. రివ‌ర్స్ డైట్‌ను పాటిస్తుంటే ఇత‌ర డైట్‌ల క‌న్నా ఫ‌లితాలు చాలా త్వ‌ర‌గా వ‌స్తాయ‌ని చెబుతున్నారు. అంటే.. అధిక బరువు త‌గ్గ‌డం, షుగ‌ర్ లెవ‌ల్స్‌, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ అవ‌డం వంటి ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఆకలిపై నియంత్రణ:

రివర్స్ డైట్‌ను పాటిస్తే.. మీరు అనుకున్న టార్గెట్ కంటే ముందే అధిక బరువును తగ్గించుకోవచ్చు. రివర్స్ డైటింగ్ వల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా చురుగ్గా ఉంటారు. ఒత్తిడి, నీర‌సం, అల‌స‌ట దరిచేరవు. రివర్స్ డైటింగ్ మెట‌బాలిజాన్ని పెంచుతుంది. అలాగే రివ‌ర్స్ డైట్‌ను పాటిస్తే.. ఆక‌లిపై నియంత్ర‌ణ ఏర్ప‌డుతుంది. దీంతో అధిక బరువును చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ రివర్స్ డైట్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను మాత్ర‌మే తీసుకుంటారు. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వాళ్లకి రివర్స్ డైట్ చ‌క్క‌గా పనిచేస్తుంది. ఇలా రివ‌ర్స్ డైట్‌ను త‌ర‌చూ పాటించ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also: స్కిన్నీ జీన్స్ సిండ్రోమ్.. ఆరోగ్యానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న ఫ్యాషన్ ట్రెండ్!

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×