E-Paper
Advertisement

Mark Butcher: నీకు ఇంగ్లండ్ కంటే, ఐపీఎల్ ఎక్కువైందా ? ఆర్చ‌ర్ పై వెంట‌నే బ్యాన్ వేయండి

Mark Butcher: నీకు ఇంగ్లండ్ కంటే, ఐపీఎల్ ఎక్కువైందా ? ఆర్చ‌ర్ పై వెంట‌నే బ్యాన్ వేయండి
Advertisement

Mark Butcher:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ డేంజర్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు సమాచారం కూడా ఇచ్చాడట. ఐపీఎల్ పూర్తయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని.. అందుకే న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉంటానని కుండ బద్దలు కొట్టి చెప్పాడట ఆర్చర్. దీనికి ఓకే చెప్పిన ఇంగ్లాండ్ బోర్డు, ఈ మేర‌కు అత‌న్ని ప‌క్క‌కు కూడా పెట్టింది. అయితే ఆర్చర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇంగ్లాండు మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. గల్లీ క్రికెట్ లాంటి ఐపీఎల్ ఎక్కువైందా? కొంచమైనా సిగ్గుండాలి అంటూ జోఫ్రా ఆర్చర్ పై మండిపడుతున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

నీకు ఇంగ్లండ్ కంటే, ఐపీఎల్ ఎక్కువైందా ?

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ కు దూరంగా ఉంటానని ప్రకటన చేసిన జోఫ్రా ఆర్చర్ పైన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచ‌ర్ (Mark Butcher) ఫైర్ అయ్యారు. ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్ తరఫున ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్ కు జోప్రా ఆర్చర్ దూరం కావడం హాస్యాస్పదమని… నమ్మ శక్యంగా లేని విషయమని పేర్కొన్నారు. ఇలాంటి వెధవలకు ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కాదని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడడం అంటేనే పరువు పోవాల్సిన విషయమని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మార్క్ బుచ‌ర్.

వెంటనే జోఫ్రా ఆర్చర్ పై బ్యాన్ విధించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కోరారు. డబ్బుల కోసం ఇంత దిగజారుతారా..? దేశానికి అన్యాయం చేస్తారా ? అని నిప్పులు చెరిగాడు. ఇకపైన ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఐపీఎల్ ఆడకుండా రూల్ పెట్టాలని కూడా సూచనలు చేశారు. చనువు ఇస్తే సంక నెక్కే రకంగా మారారని.. జోఫ్రా ఆర్చర్ ను ఉద్దేశించి మండిపడ్డారు. ఇకనైనా జోఫ్రా ఆర్చర్ తన నిర్ణయాన్ని మార్చుకొని.. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండాలని కోరారు.

ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఎప్పుడు అంటే

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూన్ 29వ తేదీతో ముగియనుంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం ఈ రెండు జట్లు మూడు టెస్టులు ఆడనున్నాయి. ఇంగ్లాండ్ గడ్డపైన ఈ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మే 31వ తేదీన ఫినిష్ కానుంది. అంటే ఈ టోర్నమెంట్ ఫినిష్ అయిన తర్వాత నాలుగు రోజుల్లోనే టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఆ సమయం తనకు సరిపోదని.. నెలపాటు రెస్ట్ తీసుకుంటానని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆర్చర్ సమాచారం ఇచ్చారట. దీనిపైన మార్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×