E-Paper
Advertisement

బంగారం కొనాలంటే లక్షలు అక్కర్లేదు.. రూ.185 చాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

బంగారం కొనాలంటే లక్షలు అక్కర్లేదు.. రూ.185 చాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో
Advertisement

Gold Price: ఇపుడు సామాన్యుడు బంగారం షాపు వైపు చూడాలంటేనే భయపడిపోయే పరిస్థితి.కాని ఒకప్పుడు తులం బంగారం ధర వెయ్యి లోపు ఉండేదని మన తాతలు చెబుతుంటే ఏదో కథలా అనిపించేది. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత జ్యువెలరీ బిల్లు చూస్తే అది కథ కాదు, పచ్చి నిజమని అర్థమవుతోంది. సుమారు 56 ఏళ్ల క్రితం నాటి ఈ బిల్లును చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు మరి. అప్పట్లో కేవలం రూ. 185 రూపాయలకే తులం బంగారం లభించేదన్న వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

also read :నడిచే కూలర్ ..ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఢిల్లీ డ్రైవర్ వీడియో!

Advertisement

తులం బంగారం ధర అక్షరాలా 185 రూపాయలు

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ‘శ్యామ్ జ్యువెలర్స్’ పేరుతో ఉన్న ఈ చారిత్రాత్మక బిల్లు 1969-70 కాలం నాటిది. ఆ బిల్లులోని వివరాల ప్రకారం.. ఒక కస్టమర్ 20 గ్రాముల బరువున్న 22 క్యారెట్ల బంగారు గొలుసును కొనుగోలు చేశారు. దానికి ఆయన చెల్లించిన మొత్తం ఎంతో తెలుసా? కేవలం రూ. 370 మాత్రమే! అంటే అప్పట్లో 10 గ్రాముల (తులం) బంగారం ధర అక్షరాలా 185 రూపాయలు అన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నగను తయారు చేసినందుకు గానూ జ్యువెలర్ తీసుకున్న మేకింగ్ ఛార్జీలు కేవలం 15 రూపాయలే. నేడు ఒక చిన్న ఉంగరం చేయించాలన్నా వేలల్లో మేకింగ్ ఛార్జీలు కడుతున్న తరుణంలో, ఈ ధరలు చూస్తుంటే ఆ కాలం ఎంత అద్భుతమో అనిపిస్తోంది. కేవలం బంగారమే కాదు, వెండి ధరలు కూడా అప్పట్లో నమ్మలేనంత తక్కువగా ఉండేవి. ఒకప్పుడు 100 గ్రాముల వెండిని కేవలం 60 రూపాయలకే కొనేవారట.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేయాల్సిన పని ఉండేది కాదు

ఈ వైరల్ బిల్లుపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “అప్పట్లో మా తాతలు ఒక కేజీ బంగారం కొని ఉంటే, ఈరోజు మేము సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేయాల్సిన పని ఉండేది కాదు.. హాయిగా రిలాక్స్ అయ్యేవాళ్లం” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రూపాయి విలువ పతనంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. 1970లో సామాన్యుడి నెల జీతం కూడా వందల్లోనే ఉండేదని, అందుకే ఆ ధరలు అప్పట్లో వారికి తగ్గట్టుగా ఉండేవని విశ్లేషకులు చెబుతున్నారు.

నేడు 24 క్యారెట్ల బంగారం తులం రూ. 1.62 లక్షలు 

గడిచిన ఐదున్నర దశాబ్దాల్లో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. 1970లో రూ. 185 ఉన్న తులం బంగారం ధర, నేడు (2026 నాటికి) 24 క్యారెట్లకు రూ. 1.62 లక్షలకు పైగా చేరుకుంది. అంటే దాదాపు 800 రెట్లు పెరుగుదల అన్నమాట. కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే కాకుండా, పెట్టుబడి రూపంలో బంగారానికి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. ఏది ఏమైనా, ఈ పాత బిల్లు మాత్రం నెటిజన్లను ఒకసారి గతాన్ని గుర్తు చేసుకునేలా చేస్తోంది.చూడాలి మరి ముందు ముందు ఈ రేట్లు ఇంకే రేంజులో పెరుగుతాయో !

also read :రణబీర్ కపూర్ నెక్స్ట్ హోమ్ అయోధ్యలోనేనా? కోట్లు పెట్టి కొన్న స్థలం డీటెయిల్స్ ఇవే!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×