E-Paper
Advertisement

ఇంట్లో గృహిణి పడే నిశ్శబ్ద పోరాటం.. కళ్ళ చెమ్మగిల్లేలా చేస్తున్న శరణ్య ప్రదీప్ ‘నేను’!

ఇంట్లో గృహిణి పడే నిశ్శబ్ద పోరాటం.. కళ్ళ చెమ్మగిల్లేలా చేస్తున్న శరణ్య ప్రదీప్ ‘నేను’!
Advertisement

Nenu Review: మన ఇంట్లో గిన్నెలు తోమే చప్పుడు వినిపిస్తుంది కానీ, ఆ గిన్నెలు తోమే చేతుల వెనక ఉండే మనసు పడే ఆవేదన ఎవరికీ వినిపించదు. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకుని డైరెక్టర్ నిహార్ కపూర్ తీసిన ‘నేను’ లఘు చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’లో పద్మగా అదరగొట్టిన శరణ్య ప్రదీప్, ఈ షార్ట్ ఫిలింలో శరణ్య అనే ఒక మిడిల్ క్లాస్ గృహిణిగా పరకాయ ప్రవేశం చేసింది.

ఇది మన వాళ్ళ కథే 

Advertisement

సినిమా మొదలైన కాసేపటికే ఇది మన అమ్మ కథో లేక మన భార్య కథో అనిపించక మానదు. పొద్దున్నే లేచి అందరి కంటే ముందు వంటింట్లోకి వెళ్లడం, అందరూ తినగా మిగిలిన కూరతో సర్దుకుపోవడం, ఆఫీస్ టెన్షన్లు భరిస్తూ మళ్ళీ ఇంటికొచ్చి మెషిన్‌లా పనిచేయడం.. ఇదంతా చూస్తుంటే “అరే, ఒక మనిషి ఇన్ని పనులు ఎలా చేస్తుంది ” అనిపించక మానదు. శరణ్య ప్రదీప్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆమె కళ్ళలో కనిపించే ఆ నిస్సహాయత, ఆఖర్లో ఆమె పేల్చే ఎమోషనల్ డైలాగులు థియేటర్లో విజిళ్లు వేయించే రేంజ్‌లో కాకుండా, గుండెను బరువుగా చేసేలా ఉన్నాయి.

also read :మిస్టర్ ఎక్స్ ఓటీటీ రివ్యూ..ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?

Advertisement

అది ఒక సర్కస్ ఫీట్‌తో సమానం

ముఖ్యంగా ఈ సినిమాలో బస్సు ప్రయాణం, ఆఫీసులో ఫైల్స్ మధ్య నలిగిపోయే సీన్లు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. మన సమాజంలో ఒక మహిళ ఉద్యోగం చేస్తూ ఇల్లు గడపడం అంటే అది ఒక సర్కస్ ఫీట్‌తో సమానం అని చాలా క్లియర్ గా చూపించారు. అయితే, సినిమాలో కొన్ని సీన్లు కొంచెం అతిగా అనిపించిన మాట వాస్తవం. ఆఫీసులో కొలీగ్స్ అందరూ కలిసి హీరోయిన్ లంచ్ బాక్స్‌ని తుడిచేయడం అనేది నేటి కాలంలో కొంచెం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే భర్త క్యారెక్టర్ మరీ అంత మొండిగా, భార్య కష్టాన్ని అస్సలు గుర్తించనట్టు చూపించడం వల్ల అది కొంతమందికి రొటీన్ విలనిజంలా అనిపించవచ్చు. గతంలో వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ లాంటి సినిమాల్లో కూడా ఇలాంటి ఎమోషన్‌నే చూసినా, శరణ్య ప్రదీప్ మార్క్ యాక్టింగ్ వల్ల ఈ ‘నేను’ ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ని ఇస్తుంది.

మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది

అసలు విషయం ఏంటంటే  ఈ సినిమా కేవలం ఆడవాళ్ల కోసం తీసింది కాదు, మనలాంటి మగాళ్లందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా. మన కోసం వాళ్ళు తమ ఇష్టాలను, చివరికి తమ వ్యక్తిత్వాన్ని కూడా ఎలా చంపేసుకుంటున్నారో ఈ చిన్న చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఆ ఎమోషనల్ టర్న్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ వరుసగా వైవిధ్యమైన కంటెంట్‌తో వస్తోంది, అందులో ఈ ‘నేను’ కచ్చితంగా ఒక మైలురాయిలా నిలుస్తుంది.

“నేను అంటే ఎవరు?”

ఈ లఘు చిత్రం ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ రూపంలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చెప్పిన నిజం కూడా అంతే ఘాటుగా ఉంది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ ఈటీవీ విన్‌లో ఈ 25 నిమిషాల ఎమోషనల్ జర్నీని చూసేయండి . చూశాక నీకు కూడా అనిపిస్తుంది.. ఆ గృహిణి అడిగే “నేను అంటే ఎవరు?” అనే ప్రశ్నలో ఎంత లోతు ఉందో!

‘నేను’ అంటే త్యాగం మాత్రమే కాదు.. తనకంటూ ఒక ప్రపంచం ఉన్న మనిషి అని గుర్తు చేసే మాస్టర్ పీస్!

Nenu review and rating : 2.25/5

also read :KD మూవీ రివ్యూ.. సౌండ్ ఎక్కువ.. సరుకు తక్కువ!

Related News

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×