E-Paper
Advertisement

కాంగ్రెస్‌లో కుర్చీ లాటరీ.. జెండా మోసినోళ్లకు హ్యాండ్.. జంప్ జిలానీలకే హవా!

కాంగ్రెస్‌లో కుర్చీ లాటరీ.. జెండా మోసినోళ్లకు హ్యాండ్.. జంప్ జిలానీలకే హవా!
Advertisement

Congress: కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వ్యూహంలో భాగంగా.. ఎన్నికల ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారు. పార్టీ మారే సమయంలో తాము అధికారంలోకి రాగానే వారికి ఇచ్చే పదవుల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు చాలా మందికి. అయితే వీటికి అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు సీనియర్లు, పార్టీ క్యాడర్. కానీ అధికారం వచ్చి మూడేండ్లైనా తమకు దక్కాల్సిన గౌరవం, ఇవ్వాల్సిన పదవుల విషయంలో అధిష్టానం అంటీముట్టనట్టుగానే ఉండటంతో అసంతృప్త గళాలు బయటకు వస్తున్నాయి.

మాకిచ్చిన హామీలు ఏమయ్యాయి?

Advertisement

ఇంటి పోరు కాస్తా రచ్చకెక్కింది. గాంధీభవన్‌కు ఈ పంచాయితీలు చేరుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పెద్ద దిక్కుగా ఇరు వర్గాల నుంచి వాదనలు బలంగా వినిపిస్తున్నారు. మాకిచ్చిన హామీలు ఏమయ్యాయి? అని కొత్తగా చేరిన నేతలు నిలదీసి మరీ పదవులు పొందుతున్న వేళ.. కొందరేమో ఫైరవీలు చేసుకుని పనులు చేసుకుంటున్న తరుణంలో.. తమకు మాత్రం ఎలాంటి గుర్తింపు లేకపోవడంపై కస్సుబుస్సుమంటున్నారు సీనియర్ లీడర్లు. జెండా మోశాం.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నో త్యాగాలకు కూడా సిద్దపడ్డాం..! కానీ ఇన్నేండ్లైనా ఇదేనా మాకిచ్చే మర్యాద? అని బాహాటంగానే అధ్యక్షుల వారి వద్ద మొరపెట్టుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్..

Advertisement

పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘ పదవుల భర్తీలో కాంగ్రెస్‌ అధిష్టానం మీనమేశాలు లెక్కిస్తోంది. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వస్తోంది. అడపాదడపా ఇచ్చే ఆ పదవుల్లో అగ్రభాగం పాతకాపులకు కాకుండా.. కొత్త వారికే ప్రయార్టీ ఇవ్వడంతో కోల్డ్ వార్‌ మరింతగా ముదురుతోంది. ఇది జిల్లాల్లో వర్గ విభేదాలకు తావిస్తోంది. ఇంకా లోకల్‌ బాడీ ఎన్నికలు జరగాల్సిన ఉన్న తరుణంలో.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కార్‌ సీరియస్‌గా ప్రిపేర్‌ అవుతున్న సమయంలో.. ఈ వర్గవిభేదాలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పార్టీ శ్రేయోభిలాషులు. కానీ ఈ విషయంలో టీపీసీసీ చీఫ్‌ మాత్రం పూర్తిగా న్యాయం చేయలేక, చేతులెత్తేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read:బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ! 

Tags

Related News

ఐపీఎస్ పేరుతో ఘరానా మోసాలు.. ఎలా ప‌ట్టుబ‌డ్డాడంటే..

మాదాపూర్‌లో హైడ్రా సంచలన ఆపరేషన్.. ఇళ్ల బెడ్‌రూమ్‌, కిచెన్‌లలో వేసిన బోర్లు బట్టబయలు!

2017 నుండి గంజాయి అమ్ముతున్న వృద్ధురాలు అరెస్ట్!

విజయవాడ ట్రిప్‌లో విషాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరు యువకులు మృతి!

నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి.. నీళ్లు ఎట్లా రావో చూస్తా: జగదీశ్వర్ రెడ్డి!

జోగులాంబ గద్వాల జిల్లాలో.. దొంగ మస్తర్లతో ఉపాధి హామీ నిధుల గోల్‌మాల్?

Almond House లో స్వీట్స్ కొంటున్నారా.. అయితే ఒక్కసారి ఇది చూడండి?

Big Stories

Advertisement
×