BigTV English
Advertisement

Nail Polish Side Effects: మీకు నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇష్టమా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Nail Polish Side Effects: మీకు నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇష్టమా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Nail Polish Side Effects: సాధారణంగా అమ్మాయిలకు అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అందులో చాలా మంది చేతి గోళ్లకు రక రకాల నెయిల్ పాలీష్‌లను వేస్తూ ఉంటారు. ఏదైనా పెళ్లిళ్లు ఫంక్షన్ల వంటి వాటికి వెళ్తే మాత్రం తప్పకుండా డ్రెస్ రంగుకు మ్యాచింగ్ ఉండేలా నెయిల్ పాలిష్‌లు వేసే వారు చాలా మందే ఉంటారు. అయితే తరచుగా వివిధ రకాల నెయిల్ పాలిష్‌లు గోళ్లకు వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మీరు కూడా తరుచుగా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.


ఇన్ఫెక్షన్లకు కారణం:
నెయిల్ పాలిష్ తయారు చేయడానికి రకరకాల రసాయనాలను వాడుతుంటారు. వీటి వల్ల గోళ్ల ఆరోగ్యంపైన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోళ్లకు పగుళ్లు ఏర్పడినప్పుడు బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తోందని అంటున్నారు.

జెల్ నెయిల్ పాలిష్ ప్రమాదమే:
కొంతమంది గోళ్లు మరింత అందంగా కనిపించడానికి జెల్ నెయిల్ పాలిష్‌లను కూడా వాడుతుంటారు. నెయిల్ పాలిష్‌ వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా అకాల వృద్ధాప్య ప్రమాణాన్ని కూడా ఇది పెంచుతుందట. నెయిల్ పాలిష్ వేసుకునే ముందు స్కిన్ పై సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.


తక్కువ కెమికల్స్ ఉన్నవి అప్లై చేసుకోండి:
నెయిల్ పాలిష్ తరచుగా వేసుకునే అలవాటు ఉన్న వారు వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే నెయిల్ పాలిష్‌లను వేసుకోండి. అలాగే మార్కెట్‌లో నెయిల్ పాలిష్‌లను కొనుగోలు చేసేటప్పుడు తక్కువ కెమికల్స్ ఉపయోగించి తయారుచేసిన వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

పాలిష్ రిమూవల్‌ను వాడకండి:
నెయిల్ పాలిష్‌ వేసుకున్నప్పుడు దాన్ని తొలగించడానికి పాలిష్ రిమూవర్లను వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఎందుకంటే రిమూవర్‌లో గోళ్లను పొడిబారేలా చేసే రసాయనం ఉంటుంది. కాబట్టి నెలకు రెండుసార్లకు మించి నెయిల్ పాలిష్‌ వాడకుండా ఉండటం మంచిది. నెయిల్ పాలిష్‌ వేసుకున్నప్పుడు ఒకే కోటింగ్ కాకుండా డబుల్ కోటింగ్ వేయడం వల్ల గోళ్లు త్వరగా విరిగిపోకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కొంతమందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అయితే నాలుగోతో గోళ్లు కొరకడం వల్ల వీటిలోని రసాయనాలు కడుపులోకి చేరుతాయి. కాబట్టి ఈ అలవాటును వెంటనే మార్చుకోండి.
దీర్ఘకాలంగా నెయిల్ పాలిష్ వాడడం వల్ల గోళ్ల చుట్టూ చర్మం పొడిబారుతుంది. అలాగే బలహీనంగా మారడంతో పాటు చిట్లడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

Related News

Drinking Turmeric Water: పసుపు నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Cardamom Benefits: యాలకులను ఇలా వాడితే.. జీర్ణ సమస్యలు పరార్ !

Weight Loss Foods: ఈజీగా.. బరువు తగ్గాలా ? అయితే ఈ పుడ్ తినండి

Morning Drinks: రక్తంలో చక్కెర స్థాయి తగ్గించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే !

Sperm Colour: వీర్యం రంగు మారుతుందా? ఆ కలర్ లో ఉంటే అంతే సంగతులు!

Chrysanthemum Flowers: సౌందర్య పరిరక్షణలో చామంతి.. మెరుపుతో అతిశయమే అనుకోరా!

Ayurvedic Plants: ఈ ఆయుర్వేద మొక్కలతో కొలెస్ట్రాల్‌‌కు చెక్ పెట్టొచ్చు !

Walnuts: వాల్ నట్స్ తినే సరైన పద్దతి ఏంటో తెలుసా ? చాలా మందికి తెలియని సీక్రెట్ !

Big Stories

×