AP Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ చిత్తూరు జిల్లా నేతలపై పడింది. ఎవరి పేరు ఎప్పుడు బయటక వస్తుందో అన్న భయాందోళనలో నేతలు ఉంటున్నారు. ఎన్నికల సమయంలో వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో అనన్న భయాందోళనతో అల్లాడిపోతున్నారట. గతంలో తిరుగు లేదని భావించిన నేతలంతా తమ వైపు మధ్యం సిట్ చూపులు పడతాయని భయపడుతున్నారంట. మొత్తం మీద ఇప్పటికే జిల్లా అగ్రనేతలు కేసులో ఇరుక్కుపోగా మిగతా నేతలు ఇదేమి తలనొప్పి అని భయపడుతున్నారంట.
లిక్కర్ స్కాంలో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి
ఏపీ లికల్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి నాలుగో నిందితుడిగా ఉన్నారని సమాచారం. తర్వాత ఇక జిల్లాల్లో ఎవరికీ సంబంధం లేదని అనుకుంటున్నారంట. ఆ క్రమంలో తిరుపతి నగరానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి కాళహస్తికి చెందిన అహ్మద్ అనే వారి పాత్ర బయటపడింది. ఇంకా ఎవరు లేరనుకున్నారు. అయితే ఉన్నట్లుండి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన గన్మెన్లను పోలీసులు వేధించారని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నిందితులుగా చేరారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీని సైతం కేసులో చేర్చారు. మరోవైపు డెప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ విజయానంద రెడ్డి సైతం కేసులో నిందితుడిగా చేరే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా విజయానంద రెడ్డిని విచారించిన సిట్కు ఊహించని వాస్తవాలు బయటపడ్డాయంట. ఎర్రచందనం స్మగ్లర్ గా 2014 లో పీడి యాక్ట్ కింద అరెస్ట్ అయిన విజయానంద రెడ్డి లారీ క్లీనర్ గా జీవితం ప్రారంభించారని తెలుస్తుంది.
వైసీపీలో కీలక నేతగా ఎదిగిన విజయానందరెడ్డి
అయితే విజయానంద రెడ్డి చిత్తూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో జీడి నెల్లూరు చంద్రగిరి నియోజక వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేశాడని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత ఆయన వైసీపీలో కీలక నాయకుడు అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 నుండి మరింత బలంగా పని చేశారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జీడి నెల్లూరు నియోజక వర్గంలో కింగ్ మేకర్ అయ్యారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో లిక్కర్ సర్ఫరా కాంట్రాక్ట్ తీసుకున్నారు. జన్మదినాల పేరుతో కోట్లాది రూపాయలు విలువైన వస్తువులు పంపినీ చేశారు. అయితే జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా చెవిరెడ్డితో కలిసి పని చేశారంటారు. ఆఫ్రికా దేశాలలో కలిసి వ్యాపారాలు కూడా చేశారని సిట్ దర్యప్తులో బయటపడింది.
అనేక సూట్ కేస్ కంపెనీల అడ్రస్సులు బహిర్గతం
చిత్తూరులోని బివి రెడ్డి కాలనీలోని నిఖిలానంద అపార్ట్మెంట్స్ లో విజయానంద రెడ్డి కార్యాలయంలో జరిపిన తనికీలలో అనేక సూట్కేస్ కంపెనీలు ఆయా అడ్రెస్ తో బయటపడినట్లు తెలుస్తుంది. వెల్టెక్ ఫుడ్ అండ్ బేవరేజెస్ పేరుతో బోర్డు ఉన్న అడ్రెస్ లో నిఖిలానంద లాజిస్టిక్స్ తో పాటు ఎంఎసి గ్రానైట్స్, సోయిసూను గ్రనైట్స్, రాజ్ గ్రనైట్స్, ఎంఎస్జే గ్రానైట్స్, నిఖిలానంద డెవలపర్స్, శ్రీసాయి కన్వెన్షన్ సెంటర్, గౌతమి ఫైనాన్స్ కంపెనీలు రిజిస్టర్ అయినట్లు సిట్ తనికీలలో బయటపడింది. నిఖిలానంద లాజిస్టిక్ పేరుతోనే మధ్యం గోడౌన్ల నుంచి మద్యం దుకానాలకు సప్లై చేసినట్లు తెలుస్తుంది. ఇందులో మార్గ మధ్యంలో పెద్ద ఎత్తున అక్రమదంద నడిచినట్లు కూడా సిట్ గుర్తించింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పేరు మీదుగా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసంలో కూడా పలు కంపెనీలు రిజిస్టర్ అయినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా గతంలో ఎయిర్ బైపాస్ రహదారిలో బిల్డింగ్ లో కేవఎస్ ఇన్ఫ్రా పేరుతో కార్యాలయం నిర్వహించారు. ఈ కార్యాలయం వేదికగా తెలంగాణ ఏపీ ఎన్నికల సర్వేలు పబ్లిసిటీ వ్యవహారాలు కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల తర్వాత వాటిని మూసివేశారు.
చెవిరెడ్డి నివాసంలో 6 కంపెనీల రిజిస్ట్రేషన్..
తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం మీద కూడా ఆరు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వాటితో పాటు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అపార్ట్మెంట్ లోని బీమ్ స్పేసెస్ ఇన్ఫ్రా పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇందులో మోహిత్ రెడ్డితో పాటు సజజల భార్గవ రెడ్డితో పాటు గతంలో ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బులు తనవేనని ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్ళిన ప్రత్యుమ్న సైతం భాగస్తుడిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు తిరుపతిలోని మంగళంలో రైట్ టైమ్స్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈషా డెవలపర్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించి 19 మంది రైతులతో డెవలప్మెంట్ కింద అగ్రీమెంట్ కూడా చేసుకున్నారు. తుడా నిధులతో ఆయా ప్రాంతాల్లో రహదారులు కూడా వేసుకొని ఆస్తుల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించారు.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అండ్ టీమ్ రూ.600 కోట్ల రియల్ దందా..
అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 6 కోట్ల రూపాయలు అది కూడా క్యాష్ తో గూడూరు ప్రాంతంలో 2022 అక్టోబర్ 260 ఎకరాలు భూమి కొనుగోలు చేసి డిసెంబర్లో అరవిందో శరత్ చంద్ర రెడ్డికి 26 కోట్లకు అమ్మివేశాడని గుర్తించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అండ్ టీం ఏకంగా 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు కూడా సిట్ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తుంది. మొత్తం మద్యం అక్రమార్జన ఈ విధంగా రియల్ ఎస్టేట్ లో పెట్టినట్లు సిట్ భావిస్తోంది. అంతేకాకుండా సిద్ధం సభలకు వేసిన బారి హోల్డింగ్స్ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని టీం పనిచేసినట్లు భావిస్తోంది. సిద్ధం సభలు మొత్తం చెవిరెడ్డి టీం నడిపించినట్లు ఇందుకు 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సిట్ప్లో బయటపడినట్లు సమాచారం.
వైఎస్ అనిల్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి దేవరాజ్ విచారణ..
పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, ఆయిటర్ బాలాజీ గోవిందప్ప, కిరణ్ కుమార్ రెడ్డి, అహ్మద్ చెవిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ వెంకటేష్ నాయుడు కేసులో నిందితులుగా ఉండగా వీరిలో మోహిత్ రెడ్డి హైకోర్ట్ బెయిల్ ద్వారా బయట ఉన్నారు. మరోవైపు బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు అయింది. కిరణ్ కుమార్ రెడ్డి అహ్మద్ పరారీలో ఉన్నారు. విజయానంద రెడ్డి పై త్వరలో కేస్ నమోదు కానున్నట్లు సమాచారం. అయితే విజయానంద రెడ్డి ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. ఇక మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి పైకి బీరాలు పలుకుతున్నప్పటికీ ఆయన కూడా తన మీదకు ఎక్కడ కేసు వస్తోందోనని భయపడుతున్నారంట. అయితే ఐదు సంవత్సరాలు మద్యం శాఖను చూసిన ఆయన సంతకాలు పెట్టందే ప్రొసీడింగ్స్ రావనే అని అంటున్నారు. తాజాగా వైఎస్ అనిల్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అయిన దేవరాజును సిట్ విచారించింది. అయితే మరోవైపు గతంలో చిత్తూరు జిల్లా ఎక్సైజ్ అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ ది సైతం అన్నమయ్య జిల్లా కావడం విశేషం.
Also Read: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?
మరోవైపు ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో నగదు పంపినీ అయినట్లు సిట్ అధికారుల విచారణలో తేలిందట. అన్ని నియోజక వర్గాలకు డబ్బుతో పాటు మద్యం సరఫరా అయ్యిందంట. దీంతో మద్యం ఎక్కడి నుంచి సరఫరా అయిందనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు మధ్యాన్ని ఎన్నికల సమయంలో తీసుకున్న ఇతర నియోజక వర్గాల నేతల్లో గుండెల్లో గుబ్బులు మొదలైందట. ఈ నేపథ్యంలో రేపు సిట్ ఎవరిని విచారణకు పిలుస్తుందో అన్న భయంతో అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారట నేతలు. మరి చూడాలి లీక్ల్కర్ స్కామ్ లో ఇంకెంతమంది బుక్ అవుతారో..
Story By Rami Reddy, Bigtv