kavitha Political Future: తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై కవిత ఆచి తూచి అడుగులు వేస్తున్నారా బిఆర్ఎస్ కు కవిత రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. సొంతంగా పార్టీ పెడతారా లేక జాగృతి పేరిట ప్రజా ఉద్యమాలు చేస్తారా లేక జాతీయ పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తారా అనేది చర్చని అంశంగా మారిందట.
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కవిత
బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచి తూచి అడుగులు వేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్లు సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే రాజకీయ నిపుణలతో పాటు జాగృతి ముఖ్యనేతలతో సంప్రదింపులు చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాతే తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జాగృతి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. తొలుతా ప్రజల్లోకి వెళ్లి వారి నుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్న కవిత
ఎమ్ఎల్సి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత జై కేసిఆర్ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి జై కేసిఆర్ అంటూ నినదించారు. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసిఆర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాలీయంగా చేసింది కాదని చర్చ నడుస్తుందట. జై కేసిఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నిలదించడం ద్వారా బిఆర్ఎస్ లోని అసంతృప్తి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ నేతలు తనకు అండగా ఉంటారని నమ్మకం
కేసీఆర్ పై గౌరవం ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే చేత స్థాయిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, సీనియర్లపై అసంతృప్తితో ఉన్న క్యాటర్న్లు తనపై సానుభూతి పెరిగి ఖచ్చితంగా తనకు అండగా నిలుస్తారు అని కవిత భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జై కేసిఆర్ నినాదాన్ని ఎత్తుకున్నట్టు విశ్లేషకుల మాట బిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కవిత వ్యహాత్మక అడుగులు జూబ్లీ హిల్స్ ఉపఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ ను తీవ్రంగా దెబ్బతిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకోని బీఆర్ఎస్
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను గులాబీ అధిష్టస్థానం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్న వారికి సైతం పార్టీలో గుర్తింపు దక్కలేదని అసంతృప్తితో కనిపిస్తున్నారు. పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కవితను పార్టీ సస్పెండ్ చేయడంతో త్వరలోనే పార్టీ పెట్టబోతుందనే ప్రచార నేపథ్యంలో అసంతృప్తి నేతలంతా ఆమెతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని టాక్ నడుస్తుందట.
పార్టీ పెట్టడానికి కవిత రంగం సిద్ధం చేసుకుంటున్నారా?
అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండడంతో ఇప్పటి నుంచి పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయట. క్షేత్ర స్థాయిలో పటిష్టమైన క్యాడర్ కావాలి. గతంలో బిఆర్ఎస్ లో పనిచేస్తున్న నేతల్లో కొంతమంది కవితకు సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా కవిత పక్షాన చేరుతారనే ప్రచారం జరుగుతుందట. దీనిని అనువుగా తీసుకొని త్వరలోనే కవిత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్.
ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభంవుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో కవిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలను జాగృతి సంస్థ తరపున నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక కవిత గ్రామస్థాయి నుంచి జాగృతి బలోపేతానికి శ్రీకారం చుట్టబోతున్నారు అంటున్నారు. ఇప్పటికే జాగృతి నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మరి కవిత యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Story By Rami Reddy, Bigtv