Thaman About OG Music: పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘ఓజీ‘. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సాహో‘ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ప్రకటనతోనే ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవల పవన్ బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ మూవీపై మరింత బజ్ పెంచాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఎప్పటికప్పుడు ఓజీ అప్డేట్ ఇస్తూ నిర్మాణ సంస్థ మూవీపై క్యూరియాసిటీ పెంచుతోంది. మరోవైపు మ్యూజిక్ తమన్ కూడా ఓజీ నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ జోష్ నింపుతున్నాడు. ప్రస్తుతం ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తమన్ సినిమాలోని సంగీతంకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా మ్యూజిక్కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఓజీ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం జపనీస్ సంగీత వాయిద్యా పరికరాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం ఓజీ సంగీతానికి సంబంధించి వర్క్ చేస్తున్నాను.
ఇందుకోసం జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి సంగీతాన్ని సమకూర్చే పనిలో ఉన్నాను‘ అంటూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అంతేకాదు కోటోతో మ్యూజిక్ తయారు చేస్తున్న వీడియోని కూడా షేర్ చేశాడు. ఈ అప్డేట్ ఓజీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. బెసిగ్గా తమన్ సింగీతం అంటేనే బాక్సులు దద్దరిల్లాస్సిందే. అలాంటి తమన్ ఓజీ కోసం జపాన్ మ్యూజిక్ ని సమకుర్చుస్తున్నాటంతో మూవీపై మరింత హైప్ పెరిగింది. ఈ క్రమంలో తమన్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చాడు. ఈ ఓజీ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మొత్తం 117 మంది సంగీత కళాకారులు పని చేస్తున్నట్టు వెల్లడించారు.
Also Read: Commoners Vs Celebrities: రెండు ఇళ్ల పంపకం.. ఎవరికి ఏ ఇళ్లు ఇచ్చారంటే?
‘హగ్రీ చిరుత నుంచి వచ్చే గర్జన అద్బుతంగా వినిపించింది. అబ్బే రోడ్ నుంచి 117 మంది ఫ్యూచరిస్టిక్ సంగీతకారులతో మ్యూజిక్ సిద్దమవుతుంది. ఓజీ.. సంగీతం అద్బుతంగా ఉంది‘ అంటూ పోస్ట్ షేర్ చేశాడు. తమన్ ఇచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ మూవీపై విపరీతమైన బజ్ పెంచుతోంది. ఇది చూసి ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. సెస్టెంబర్ 25న బాక్స్లు దిద్దరిల్లాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. మరి సెప్టెంబర్ 25న ఓజీ ఎలాంటి సెన్సేషన్ చేస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో పవన్ సరసన తమిళ్ బ్యూటీ ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన ఓమీగా నెగిటివ్ షేడ్స్ ఉన్న గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. అలాగే శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబులు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.
#HungryCheetah 🐆 Was Sounding So Gigantic 🖤
From @AbbeyRoad With 117 Futuristic Musicians 🥹#OgBGM ❤️ pic.twitter.com/06ffXhNekY— thaman S (@MusicThaman) September 8, 2025