BigTV English

Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. మొన్న కాలు.. నిన్న స్కూటీ.. నేడు ఇల్లు..!

Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. మొన్న కాలు.. నిన్న స్కూటీ.. నేడు ఇల్లు..!

Raghava Lawrence:సినిమా ఇండస్ట్రీ ద్వారా కోట్లు సంపాదించే చాలామంది.. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కనీసం తమ అభిమాని కష్టాల్లో ఉన్నారని తెలిసినా కూడా పట్టించుకోరు.అయితే అందరు హీరోలు అలా ఉండరు.చాలామంది దయా హృదయులు కూడా ఉంటారు. అలాంటి వారిలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కూడా ఒకరు.. రాఘవ లారెన్స్ కొన్ని ట్రస్టులు ఏర్పాటు చేసి ఎంతోమంది పేదవాళ్ళకి, అనాధలకి, ముసలివాళ్లకి, దివ్యాంగులకి తన వంతు సహాయం చేస్తున్నారు. అలా కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ చేయూత అందిస్తూ రాఘవ లారెన్స్ చేసే గొప్ప పనులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలా తాజాగా రాఘవ లారెన్స్ ఓ దివ్యంగురాలైన అమ్మాయికి సహాయం చేస్తూ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. మరి ఇంతకీ రాఘవ లారెన్స్ ద్వారా సహాయం పొందిన ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.


దివ్యాంగురాలు శ్వేతా కి అండగా నిలిచిన రాఘవ లారెన్స్..

రాఘవ లారెన్స్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు..బయట కూడా హీరోనే. ఆయన తన సేవా కార్యక్రమాలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ క్రమంలోనే తాజాగా శ్వేత అనే ఓ యువతకి రాఘవ లారెన్స్ జీవితంలో మర్చిపోలేని సహాయం చేశారు.. కడు పేదరికంలో కూరుకుపోయిన శ్వేత అనే యువతి నడవలేదు. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె చాలా రోజులుగా బెడ్ కే పరిమితమైపోయింది. అయితే శ్వేత దీన పరిస్థితి తెలుసుకున్న రాఘవ లారెన్స్ వెంటనే ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు అండగా నిలిచారు. దివ్యాంగురాలైన శ్వేతకు కృత్రిమ కాలు ఇచ్చి సపోర్ట్ చేయడమే కాకుండా ఆమె కోసం ఒక స్కూటీని కూడా బహుకరించారు..

ALSO READ:Boney Kapoor: నన్ను శ్రీదేవి రూంలోకి రానివ్వలేదు.. ఇన్నాళ్లకు బయపెట్టిన బోనీ కపూర్!


ఇల్లు కట్టిస్తానని హామీ..

అలా రాఘవ లారెన్స్ చేసిన సహాయంతో శ్వేత తన కాళ్ళ మీద తాను నిలబడింది. ఇక ఇక్కడితో ఆగకుండా శ్వేతకు మరో సాయం కూడా చేశారు. చాలా రోజులుగా గుడిసెలో జీవిస్తున్న దివ్యాంగురాలైన శ్వేతకి ఒక ఇల్లు కట్టించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా శ్వేతకి ఇల్లు కూడా కట్టిస్తాను అని హామీ ఇచ్చి, ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టారు లారెన్స్.. ప్రస్తుతం రాఘవ లారెన్స్ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ రాఘవ లారెన్స్ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. ఇప్పటికే పలు చారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తూ.. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన రాఘవ లారెన్స్ మరోసారి దివ్యాంగురాలైన శ్వేతకు ఇల్లు కట్టిస్తానని చెప్పి ఆమె జీవితంలో వెలుగులు నింపారు.

రాఘవ పై ప్రశంసల వెల్లువ..

ఇక ఇవే కాకుండా రాఘవ లారెన్స్ బయటికి చెప్పని మరెన్నో సాయాలు కూడా చేశారు. ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ చదువుని కొనసాగేలా చేయడమే కాకుండా కొంతమందికి స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ చదివిస్తున్నారు. అలా ముసలి వాళ్లకు, తల్లిదండ్రులు లేని అనాధలకు, దివ్యాంగులకు,ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, రైతులకు ఇలా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూ తన ఉదార హృదయాన్ని చాటుకుంటున్నారు. ఇక రాఘవ లారెన్స్ చేసే సేవలకు ఎంతోమంది జనాలు మెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉండే నటీనటులలో కొంతమంది అయినా రాఘవ లారెన్స్ లా ఉంటే బాగుండు అని కామెంట్లు పెడుతున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

Raashi khanna: రాశి ఖన్నా భావోద్వేగ పోస్ట్.. జీవితాంతం గుర్తుండిపోతాయంటూ!

OG Movie: ‘ఓజీ’ కోసం రంగంలోకి 117 మంది సంగీత కళాకారులు.. తమన్‌ క్రేజీ అప్‌డేట్‌

Navya Nair: ఎయిర్ పోర్ట్ లో నటికి చేదు అనుభవం.. మల్లెపూలు తీసుకెళ్లిందని లక్ష జరిమానా

Abhinav Kashyap: సల్మాన్ ఖాన్ ఒక గుండా.. అసభ్యకరమైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Boney Kapoor: నన్ను శ్రీదేవి రూంలోకి రానివ్వలేదు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బోనీ కపూర్!

Big Stories

×