BigTV English

Aloe Vera For Hair: అలోవెరా ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Aloe Vera For Hair: అలోవెరా ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది


Aloe Vera For Hair: కలబంద (అలోవెరా) జుట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు, మందంగా, నల్లగా మారడానికి ఎంతగానో సహాయపడుతుంది. కలబందలో విటమిన్లు, ఎంజైములు, అమినో ఆమ్లాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా రాలకుండా కూడా సహాయపడతాయి. ఇంతకీ జుట్టు పెరుగుదలకు అలోవెరాను ఎలా , ఎంత మోతాదులో ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద జెల్ , కొబ్బరి నూనె :


ఒక గిన్నెలో రెండు చెంచాల కలబంద జెల్, ఒక చెంచా కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని తల స్కాల్ప్‌కి, జుట్టుకు బాగా పట్టించాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేసి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఈ పద్ధతి జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా రాలకుండా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ రెమెడీని తరచుగా వాడటం వల్ల కూడా అద్భుతమైపన ఫలితాలు ఉంటాయి.

కలబంద ,ఉల్లిపాయ జ్యూస్:

ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా మంచిది. ఒక చెంచా కలబంద జెల్, ఒక చెంచా ఉల్లిపాయ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కి పట్టించి, 20 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేయండి. ఈ చిట్కా జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.

కలబంద, ఆముదం:

ఆముదం జుట్టు పెరుగుదలకు చాలా ప్రసిద్ధి చెందింది. రెండు చెంచాల కలబంద జెల్, ఒక చెంచా ఆముదం బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు స్కాల్ప్‌కి బాగా మసాజ్ చేసి.. ఉదయం షాంపూతో శుభ్రం చేయండి. ఇది జుట్టును మందంగా, ఆరోగ్యంగా చేస్తుంది.

కలబంద జెల్, నిమ్మరసం:

చుండ్రు సమస్య ఉన్నవారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో కలబంద జెల్ ,కొద్దిగా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కి పట్టించి, 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది చుండ్రును తగ్గించి, స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుతుంది.  ఇందులో వాడిన నిమ్మరసం కూడా చుండ్రను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే.. జుట్టు పెరుగుదలకు అలోవెరాలో వివిధ రకాల పదార్థాలు ఉపయోగించి వాడొచ్చు. రసాయనాలతో తయారు చేసే ప్రొడక్ట్స్ కంటే వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: బెల్లం Vs పంచదార.. ఏది తింటే బెటర్ ?

కలబందను నేరుగా జుట్టుకు పట్టించడం:

తాజా కలబంద మొక్క నుంచి జెల్ తీసి నేరుగా స్కాల్ప్‌కి , జుట్టుకు పట్టించవచ్చు. ఇది జుట్టుకు సహజమైన కండిషనర్‌లా పనిచేసి, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

ఈ చిట్కాలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే.. ఏదైనా కొత్త పదార్థాన్ని వాడే ముందు, ఒక చిన్న ప్రదేశంలో టెస్ట్ చేయడం మంచిది. కలబందను రెగ్యులర్‌గా వాడడం ద్వారా ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు పొందవచ్చు.

Related News

Kidney Disease: మీ ముఖం, మెడ.. ఇలా మారుతున్నట్లయితే కిడ్నీ సమస్యలు మొదలైనట్లే !

Milkshake: ఒక్క మిల్క్ షేక్‌తో మీ మైండ్ మటాష్.. తాగిన కొన్ని గంటలో ఏమవుతుందో తెలుసా?

Without Slippers Walking: వావ్, చెప్పులు లేకుండా నడిస్తే.. మతిపోయే లాభాలు !

Health Tips: భోజనం తర్వాత.. ఈ పనులు అస్సలు చేయొద్దు

Leg Pain: రాత్రిపూట కాళ్ళ నొప్పులా ? ఇవి వాడితే సమస్య దూరం

Big Stories

×